Star Heroines: సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. చిత్ర పరిశ్రమలో సెటిల్ అయినా.. ఎప్పటికప్పుడు హిట్స్ ఇస్తూనే ఉండాలి. వరుస ఫ్లాప్ లు వస్తుంటే.. మళ్లీ సినిమాలో అవకాశాలు రావడం కూడా కష్టమే. అయితే కొంత మంది వచ్చి రావడమే హిట్ ను అందుకొని తర్వాత నిలవలేకపోతారు. కొందరికి సినిమాలు ఎంచుకోవడంలో పొరపాటు పడుతారు. లేదా మరేవైన సమస్యలు రావచ్చు. మరికొందరు హీరోయిన్ లు మాత్రం పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయిపోతుంటారు. కొంతమంది మాత్రం చిత్ర పరిశ్రమకు దూరంగా.. ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అని తెలియకుండా జీవిస్తుంటారు. అలా కనుమరుగు అయినా నటీనటులు ఎంతో మంది. కానీ సోషల్ మీడియా వల్ల చాలా మంది గురించి తెలుస్తుంది. అయితే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే కనిపించకుండా పోయిన హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వే కావాలి హీరోయిన్ రిచా
హీరోయిన్ రిచా పల్లాడ్ అంటే చాలా మందికి తెలియదు కానీ నువ్వే కావాలి సినిమా హీరోయిన్ ఎవరు అంటే టక్కున అమ్మడు ఫేస్ కళ్ల ముందు కదులుతుంది. అభిమానులకు నువ్వే కావాలి సినిమాతో చాలా దగ్గరైంది రిచా. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తరుణ్ సరసన నటించింది రిచా. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా రిచా అభిమానులు పెరిగిపోయారు. అయితే ఈ చిత్రం దాదాపుగా 22 ఏళ్ల క్రితం వచ్చింది. కానీ ఇప్పటికీ ఈ సినిమాను సోషల్ మీడియాలో వీక్షించేవారు కోకొల్లాలు. ఇప్పటికీ ఈ సినిమాకు అభిమానులు ఎక్కువే. అయితే ఈ సినిమా తర్వాత రిచా ఎందుకో ఇంతవరకు ఇండస్ట్రీలో ఎక్కడ కూడా కనిపించలేదు. ప్రస్తుతం భర్తకు తోడుగా ఉంటూ.. కుటుంబ బాధ్యతలు పోషిస్తున్న రిచా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈమె ఇప్పటికీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది. కానీ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది అని ఎక్కడ వార్తలు వినిపించలేదు.
నువ్వు నేను హీరోయిన్ అనిత..
బుల్లితెర సెలబ్రిటీ, నువ్వు నేను హీరోయిన్ అనిత ఉదయ్ కిరణ్ తో కలిసి జతకట్టి మెప్పించింది. శ్రీరామ్, నేనున్నాను వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న భామ అనిత. కానీ ఈ రెండు చిత్రాలతోనే టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో తాళ్, కుచ్ తో హై, యే దిల్, కృష్ణా కాటేజ్, రాగిణి ఎంఎంఎస్, హీరో వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత యే హై మొహబ్బతే, నాగిన్ సీరియల్స్ తో బుల్లితెరపై మళ్లీ సందడి చేసింది. 2013 లో రోహిత్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది నటి అనిత. ఇప్పుడు ఆమెకు ఒక మగబిడ్డ కూడా ఉన్నాడు. మరి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుందా? లేదా చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెబుతుందా అని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
చిత్రం మూవీ హీరోయిన్ రీమా సేన్
ఉదయ్ కిరణ్, రీమా సేన్ కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా చిత్రం. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలించింది. బాక్సాఫీస్ ను కూడా షేక్ చేసింది సినిమా. అయితే తొలి సినిమాతోనే రీమా స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఈ ఒక్క సినిమా తర్వాత రీమాకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. బావనచ్చాడు, మనసంతా నువ్వే, సీమ సింహం, అంజి బంగారం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇక కెరీర్ మొత్తంలో సూపర్ హిట్ బెస్ట్ చిత్రాల్ల నిలిచే చిత్రాలు `చిత్రం`, యుగానికొక్కడు అని చెప్పాలి. ఇక సినిమాలకు దూరమైన తర్వాత రీమా 2012లో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయినా శివకరణ్ సింగ్ ను పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది..
వంశీ మూవీ హీరోయిన్ నమ్రత..
వంశీ సినిమాలో మహేష్ బాబు, నమ్రత కలిసి నటించారు. దీంతో వీరు కూడా ప్రేమలో పడి.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. గౌతమ్, సితార. వీరి గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అయితే పెళ్లి తర్వాత సినిమాలో అవకాశాలు వచ్చినా ఆమె నటించలేదు.