Star Directors: టాలీవుడ్ కి శాపం గా మారుతున్న స్టార్ డైరెక్టర్స్…కారణం ఏంటంటే..?

భారీ బడ్జెట్ తో సినిమాలను తీసి విజువల్స్ పరంగా, కథపరంగా చాలా టాప్ నాచ్ లో సినిమాలను చూపించడంతో వాటిని చూసిన మన ప్రేక్షకులు వచ్చే సినిమాలన్నీ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలని ఊహించుకుంటున్నారు.

Written By: Gopi, Updated On : June 20, 2024 8:30 am

Star Directors

Follow us on

Star Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య వచ్చిన చిన్న సినిమాలు ఏవి కూడా ఆశించిన విజయాన్ని అందుకోవడం లేదు.కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమం లో దీనికంతటికి కారణం తెలుగులో సూపర్ సక్సెస్ అయిన స్టార్ డైరెక్టర్లే అని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్లు భారీ బడ్జెట్ తో సినిమాలను తీసి విజువల్స్ పరంగా, కథపరంగా చాలా టాప్ నాచ్ లో సినిమాలను చూపించడంతో వాటిని చూసిన మన ప్రేక్షకులు వచ్చే సినిమాలన్నీ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలని ఊహించుకుంటున్నారు.

కాబట్టి చిన్న సినిమాలని చూసినా కూడా అవి తమకు పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వడం లేదని అందువల్లే వాళ్ళు చిన్న సినిమాలు చూడడం కూడా మానేశారని ఒకవేళ సక్సెస్ టాక్ వస్తే అప్పుడు ఆ సినిమాను చూడడానికి కొంతవరకు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే తెలుగులో రాజమౌళి సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ వల్లే ఈ రోజున చిన్న దర్శకులకు, చిన్న సినిమాలకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇక వచ్చిన అవకాశాలను కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడానికి కారణం కూడా ఆ దర్శకులే అంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే తమ సినిమాలతో తమను తాము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి చిన్న డైరెక్టర్లు సూపర్ సక్సెస్ ని అందుకోవాలంటే కాన్సెప్ట్ అనేది చాలా హై లెవెల్లో ఉండాలి. అలాగే విజువల్స్ పరంగా కూడా కొంతవరకు ఒక క్లారిటీని చూపించాలి అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక మూస ధోరణి లో సినిమాలు తీస్తే మాత్రం అలాంటి సినిమాలకు కాలం చెల్లిందనే చెప్పాలి. ఇక ప్రేక్షకుడు అన్ని రకాల సినిమాలను చూస్తున్నారు కాబట్టి వాళ్లకు ది బెస్ట్ అవుట్ పుట్ ని ఇచ్చే ప్రయత్నం చేయాలని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఫ్యూచర్ లో అయిన వాళ్ళు చేసే చిన్న సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయా లేదా అనేది…