Star Anchor- Hyper Aadi: ఈటీవీ ఛానెల్ లో గత పదేళ్ల నుండి ప్రసారం అవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా టాలీవుడ్ కి ఎంత మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ పరిచయం అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకున్నా కేవలం టాలెంట్ ని నమ్ముకొని వచ్చిన ఎంతో మందికి అవకాశం కలిపించిన గొప్ప ప్లాట్ ఫార్మ్ గా నిలిచింది జబర్దస్త్ కామెడీ షో..ఈ కామెడీ షో ద్వారానే హైపర్ ఆది పరిచయం అయ్యాడు..తన అద్భుతమైన కామెడీ షమింగ్ తో ఆయన వేసే పంచులు కడుపుబ్బా నవ్విస్తాయి..అలా మనం చూస్తూ ఉండగానే ఎవ్వరికి అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు హైపర్ ఆది ..ప్రస్తుతం ఈయన టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్స్ లో ఒక్కరిగా కొనసాగుతున్నారు..అయితే తనకి ఉన్న ఫుల్ బిజీ కారణంగా గత నాలుగు వారల నుండి జబర్దస్త్ షో కి డుమ్మా కొడుతున్న హైపర్ ఆది, ప్రస్తుతం ఢీ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..గతం లో సుడిగాలి సుధీర్ తో కలిసి హైపర్ ఆది మరియు యాంకర్ ప్రదీప్ లు పండించే కామెడీ కిరాక్ గా ఉండేది..కేవలం ఈ ముగ్గురి కాంబినేషన్ లో పండే కామెడీ ని చూసి రిలాక్స్ అవ్వడానికి ఢీ షో ని చూసే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Also Read: Bandi Sanjay: అమాయక రైతులపై అమానుష దాడులా? ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్
అయితే సుడిగాలి సుధీర్ ఈ షో ని మానేసినప్పటి నుండి ఢీ షో కి కాస్త కలతప్పింది..సుధీర్ వెళ్లిపోయిన తర్వాత ఇక కామెడీ ని పండించే బాధ్యత పూర్తిగా హైపర్ ఆది మరియు యాంకర్ ప్రదీప్ పై పడింది..ఇది ఇలా ఉండగా వచ్చే వారం ప్రసారం అయ్యే ఢీ షో కి సంబంధించిన ఒక్క ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఈ ప్రోమో లో ఒక్క కాలేజీ సెట్ వేసి అందులో ఒక్క స్టూడెంట్ గా హైపర్ ఆది మరియు రవి కనిపిస్తారు..వీరితో పాటు మరి స్టూడెంట్ గా నవ్య స్వామి కనిపిస్తుంది..అలా సరదాగా సాగుతున్న స్కిట్ లో మధ్యలో యాంకర్ ప్రదీప్ దూరి హైపర్ ఆది తల పై గట్టిగ కొడుతాడు..అంతే ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అవుతారు..యాంకర్ ప్రదీప్ కొట్టింది కామెడీ కోసమే అయ్యినప్పటికీ హైపర్ ఆది కి బాగా దెబ్బ తగలడం తో హర్ట్ అయ్యాడట..ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది..హైపర్ ఆది మరియు ప్రదీప్ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు అయ్యినప్పటికీ కూడా సడన్ గా ప్రదీప్ అలా తల మీద తన్నెలోపు హర్ట్ అయ్యాడు అని తెలుస్తుంది..ఈ ఎపిసోడ్ వచ్చే బుధవారం రాత్రి 9 :30 కి ప్రసారం కానుంది.

Also Read: Rajamouli RRR Copied Scenes: మక్కికి మక్కీ దించాడు.. రాజమౌళి మరో కాపీ పేస్ట్
Recommended Videos:
[…] […]