Anchor Srimukhi: యాంకర్ శ్రీముఖి సైమా ఈవెంట్ కి తీసుకున్న రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. రెండు రోజుల ఈవెంట్ కి లక్షల్లో ఛార్జ్ చేసిన ఆమె క్రేజ్ గురించి టాలీవుడ్ జనాలు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. శ్రీముఖికి అంత డిమాండ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. శ్రీముఖి బుల్లితెర టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి గ్లామరస్ యాంకర్స్ ని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగారు. యాంకర్ గా శ్రీముఖి ఫస్ట్ షో పటాస్. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో ప్రసారమైన పటాస్ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. యాంకర్ రవితో పాటు శ్రీముఖి పటాస్ లో మెరుపులు మెరిపించారు.

ఆ షోతో వచ్చిన పాపులారిటీతో శ్రీముఖి అవకాశాలు అందుకుంటూ ఓ స్థాయికి ఎదిగారు. బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు షోస్ ఉన్నాయి. ప్రత్యేక ఈవెంట్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా బెంగుళూరు వేదికగా సైమా 2022 వేదిక ఘనంగా జరిగింది. సైమా వేడుకలో తెలుగు విభాగానికి యాంకర్స్ గా శ్రీముఖి, నటుడు ఆలీ వ్యవహరించారు. తమదైన హోస్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నారు. కాగా ఈ ఈవెంట్ కి శ్రీముఖి భారీగా ఛార్జ్ చేశారట.
రెండు రోజుల సైమా ఈవెంట్ కొరకు శ్రీముఖి అక్షరాలా రూ. 10 లక్షలు తీసుకున్నారట. అంటే రోజుకు ఐదు లక్షలన్న మాట. టాప్ యాంకర్ సుమ సైతం ఈ రేంజ్ లో ఛార్జ్ చేయడం లేదు. ఈవెంట్ కి సుమ ఐదు లక్షలకు లోపే తీసుకుంటారట. సైమా నిర్వాహకులు యాంకర్ శ్రీముఖికి పదిలక్షల పారితోషికం ఇచ్చారన్న వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే వేదికపై తన అభిమాన హీరోని కౌగిలించుకోవాలన్న కోరిక కూడా తీర్చుకుంది. రణ్వీర్ సింగ్ ని హగ్ చేసుకొని ముద్దులు పెట్టింది. రణ్వీర్ శ్రీముఖి రెండు చేతులపై కిస్ చేయడం మరో విశేషం.
యాంకర్ గా టాప్ గేర్ లో దూసుకెళుతున్న శ్రీముఖి హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. క్రేజీ అంకుల్స్, ఇట్స్ టైం టు పార్టీ చిత్రాల్లో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. అలాగే క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి విలన్ భార్యగా కనిపించారు. ఇక రెండు చేతులా సంపాదిస్తున్న శ్రీముఖి ఖాళీ దొరికితే విందులు, వినోదాల్లో పాల్గొంటూ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.