Bigg Boss 6 Telugu- Eviction Free Pass Task: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన కెప్టెన్సీ టాస్కులో విజేతగా నిలిచి రేవంత్ రెండవసారి ఇంటి కెప్టెన్ అయ్యాడు..అయితే ఈరోజు బిగ్ బాస్ ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ టాస్కు ని నిర్వహించగా బిగ్ బాస్ ప్రైజ్ మనీ నుండి కొంత డబ్బులు బిడ్ చేసి శ్రీహాన్, ఫైమా మరియు రేవంత్ పోటీదారులుగా నిలుస్తారు..ఈ పోటీ కూడా రసవత్తరంగా సాగుతుంది..ఇంటి సభ్యులందరు కూడా రేవంత్ మరియు శ్రీహన్ ని ఎక్కువ టార్గెట్ చెయ్యడం మొదలు పెట్టారు.

పోటీదారులుగా నిలిచిన ఈ ముగ్గురిలో ఎవరు ఏవిక్షన్ ఫ్రీ పాస్ కి అర్హులు కాదో..ఆ కంటెస్టెంట్స్ భుజాన తగిలించిన కర్రకి బిగ్ బాస్ ఇచ్చిన మూటలను తగిలించాలి..బరువుతో కూడిన ఆ మూటలను బజర్ సౌండ్ మోగేవారుకూ దించకుండా మొయ్యాలి..ఫైమా కి కేవలం రెండు మూటలు మాత్రమే తగిలించగా రేవంత్ మరియు శ్రీహాన్ కి అత్యధిక మూటలు తగిలిస్తారు..ఇద్దరు కూడా చాలా కష్టంగానే ఆ బరువుని మోస్తారు.
వీళ్లిద్దరు అంత కస్టపడి మోసేది శ్రీ సత్య కోసమే..ఎందుకంటే ఈ వారం ప్రస్తుతం డేంజర్ జోన్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్స్ లో ఆమెకూడా ఒకటి..ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..రేవంత్ మరియు శ్రీ హాన్ ఇద్దరు కూడా శ్రీ సత్య కి మంచి స్నేహితులు..వీళ్ళిద్దరిలో ఎవరికీ ఏవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినా కూడా శ్రీ సత్య ని సేవ్ చెయ్యడానికి ఉపయోగిస్తారు.

ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది శ్రీ సత్యనే అని ఆమెకి కూడా అర్థం అయిపోయింది..అందుకే వీళ్లిద్దరికీ పూర్తి స్థాయి లో ఈ టాస్కులో సపోర్ట్ ఇచ్చింది..అయితే శ్రీహాన్ మాత్రం బరువు మొయ్యలేక కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు..కానీ రేవంత్ మాత్రం క్రింద పడిపొయ్యే రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా బలంగా నిలబడడానికి ట్రై చేస్తాడు..ఆ తర్వాత ఏమి జరిగింది..రేవంత్ ఈ టాస్కు గెలిచి ఏవిక్షన్ ఫ్రీ పాస్ ని గెలుచుకుంటాడా..లేదా ఫైమా కి ఆ పాస్ దక్కుతుందా అనేది చూడాలి.