Sid Sriram: ప్రస్తుతం ఇండియాలోని టాప్ సింగర్స్ లో సిద్ శ్రీరామ్ ఒకరు. గత కొన్నేళ్లుగా మెలోడీ పాటలకు సిద్ శ్రీరామ్ కేరాఫ్ గా మారాడు. ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘కడల్’ సినిమాతో సిద్ శ్రీరామ్ ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయం అయిన సంగతి అందరి తెల్సిందే. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’తో అతడి పాటల ప్రస్థానం మొదలైంది.

‘అలవైకుంఠపురములో’ సిద్ శ్రీరామ్ పాడిన ‘సామజవరగమన’ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. సినిమా విజయంలో ఈ పాట కీలకంగా మారింది. అలాగే ‘గీతా గోవిందం’ మూవీలో ‘ఇంకేం ఇంకేం కావాలే’.. ‘మాటే వినదుగ వినదుగ’ అనే పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రతీఒక్కరు కాల్ ట్యూన్ ఈ పాటనే అప్పట్లో పెట్టుకునే వాళ్లంటే అతిశయోక్తి కాదేమో.
అంతలా తన పాటల మాధుర్యంతో సిద్ శ్రీరామ్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. తాజాగా వచ్చిన ‘పుష్ప’లోనూ సిద్ శ్రీరామ్ ‘శ్రీవల్లి’ పాటను పాడారు. ఈ సాంగ్ కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే సిద్ శ్రీరామ్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వానమ్ కొట్టటుమ్’ అనే మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్నాడు.
ఈ మూవీకి తొలుత ‘96’ ఫేమ్ గోవింద్ వసంతను సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేశారు. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ స్థానంలో సిద్ శ్రీరామ్ వచ్చి చేరారు. అలా సిద్ శ్రీరామ్ సింగర్ నుంచి సంగీత దర్శకుడిగా మారుతున్నారు. కాగా మణిరత్నం త్వరలో తెరకెక్కించే ఓ మూవీ ద్వారా సిద్ శ్రీరామ్ హీరోగా పరిచయం కాన్నున్నారనే టాక్ విన్పిస్తోంది.
ఇప్పటికే వీరిద్దరి చర్చలు జరిగినట్లు కోలీవుడ్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇది కనుక జరిగితే సింగర్ గా, దర్శకుడిగా, హీరోగా సిద్ శ్రీరామ్ ను మార్చిన క్రెడిట్ మణిరత్నంకే దక్కడం ఖాయం.