Serial Actor Rajkumar: చిరంజీవి స్టైల్ ను కాపీ చేసి కెరియర్ లేకుండా చేసుకున్న స్టార్ హీరో…

రాజ్ కుమార్ అనే ఒక నటుడు ప్రత్యేకంగా చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ వచ్చాడు. అయితే మొదట్లో హీరోగా కొన్ని సినిమాలని చేసినప్పటికీ ఆ తర్వాత చిరంజీవిని అనుసరిస్తున్నాడు అనే ఉద్దేశ్యం తో అతన్ని చిరంజీవికి కాపీగా గుర్తించారు.

Written By: Gopi, Updated On : June 23, 2024 9:36 am

Serial Actor Rajkumar

Follow us on

Serial Actor Rajkumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 40 సంవత్సరాలుగా మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రఖ్యాతమైన పేరు ప్రఖ్యాతలను సాధించుకున్న ఒకే ఒక్కడు చిరంజీవి… అయితే ఈయన అప్పట్లో సినిమాలు చేయడమే కాకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా ఇన్స్పిరేషన్ గా మారాడు. ఆయన సినిమాలే కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటివి స్థాపించి చాలామంది ప్రాణాలు కోల్పోయే వారికి సైతం సకాలంలో బ్లడ్ అందించి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టాడు.

ఇక తన బ్లడ్ బ్యాంకుకి తన అభిమానులు స్వచ్ఛందంగా బ్లడ్ ఇస్తూ చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా చాలా మందికి అండగా నిలబడ్డారు. ఇక మొత్తానికైతే చిరంజీవి అంటే ఒక ట్రెండ్ అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తను టాప్ హీరోగా ఉన్నప్పుడు అతన్ని అనుసరిస్తూ చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగాలని చూశారు. కానీ వాళ్ళు చాలా కాలం పాటు ఇండస్ట్రీ లో నిలువలేకపోయారు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజ్ కుమార్ అనే ఒక నటుడు ప్రత్యేకంగా చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ వచ్చాడు. అయితే మొదట్లో హీరోగా కొన్ని సినిమాలని చేసినప్పటికీ ఆ తర్వాత చిరంజీవిని అనుసరిస్తున్నాడు అనే ఉద్దేశ్యం తో అతన్ని చిరంజీవికి కాపీగా గుర్తించారు.

ఇక దానివల్ల ఆయనకి హీరోగా అవకాశాలైతే తగ్గిపోయాయి. ఎందుకంటే చిరంజీవి ని ఇమిటేట్ చేయడమే ఆయన కెరియర్ కి ఒక శాపం లా మారింది. ఇక దీనివల్ల తనకంటూ ఓన్ స్టైల్ ను క్రియేట్ చేసుకోవడంలో తను ఫెయిల్ అయ్యాడు. అందువల్లే అతనికి సినిమాల్లో హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. తద్వారా ఆయన ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోవాల్సి వచ్చింది.

ఇక ఆ తర్వాత అడపాదడపా కొన్ని సీరియల్స్ లో నటించినప్పటికీ అవి కూడా ఆయనకు పెద్దగా గుర్తింపునైతే తీసుకురాలేదు. ఇక దాంతో ఇండస్ట్రీ నుంచి మొత్తానికే ఫేడౌట్ అయిపోయాడు…ఇక ఎప్పుడైనా గాని ఎవరిని అయిన ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే పర్లేదు కానీ, పూర్తిగా వాళ్ళలాగే కాపీ చేయాలని చూస్తే మాత్రం కెరియర్ కే ప్రమాదం అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…