Saregamapa Show: బుల్లితెరపై పాటల పూదోటగా సువాసనలు విరాజిల్లుతున్న ‘సరిగమప షో’లో ఈ ఆదివారం అనూహ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రేక్షకాదరణతో దూసుకుపోతూ అందరి మనసులు గెలిచిన పేదింటి అమ్మాయి ‘పార్వతి’ తోపాటు కీర్తన , కళ్యాణిలు ఎలిమినేట్ కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. భర్తతో విడాకులు తీసుకొని.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పాటలే ప్రాణంగా ముదుకు సాగుతున్న కళ్యాణి సైతం ఎలిమినేట్ అయిపోవడం అందరినీ ఆవేదనకు గురిచేసింది.

ముందు నుంచి పార్వతి అందరి మనసు గెలుచుకుంది. తను నల్లగా ఉండడంతో ఎంతలా అవమానించారో.. కాకి రూపం.. కోకిల గొంతు అని ఎంతలా ఏడిపించారో అందరికీ చెప్పి ఎలా కష్టపడి ఇక్కడికి వచ్చిందో స్ఫూర్తిని పంచింది.. అలానే తన పాటతో అందరి మనసు గెలిచి ఏకంగా తన ఊరుకు బస్సును కూడా వేయించుకుంది.
ఇక కళ్యాణి భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక చంటిబిడ్డలతో విడిపోయి సొంతంగా ఎదుగుతూ పాటలే ప్రాణంగా బతుకుతోంది. 18 ఏళ్లకే లవ్ మ్యారేజ్ చేసుకున్న ‘కళ్యాణి’ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ భర్త పెట్టే బాధలు చూడలేక నాలుగేళ్లకు విడాకులిచ్చింది. తల్లిదండ్రులు ఇలా చిన్న చిన్న గొడవలు సర్దుకోవాలన్నా.. ఆ శాడిస్టు భర్తను వినూత్న భరించలేకపోయింది. పిల్లలకు కూడు, గుడ్డ పెట్టలేని భర్తను చీకొట్టింది. అనంతరం సొంతంగా జాబ్ సంపాదించి వారికి ఇప్పుడు మూడు పూటలా మంచి భోజనం, వసతి కల్పిస్తోంది. ఇక కీర్తన కూడా బాగా పాడిన ఆమె కూడా ఎలిమినేట్ అయిపోయింది.

వీరందరికంటే కూడా మిగతా కంటెస్టెంట్లు బాగా పాడడం.. వారితో పోల్చితే వీరి గాన సామర్థ్యం తక్కువగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జడ్జి అయిన ఎస్పీ శైలజ తప్పనిసరి పరిస్థితుల్లో ఎలిమినేషన్ ను మొదలుపెట్టారు. ఇందులో ఆరుగురు డేంజర్ జోన్లో ఉండగా.. ముగ్గురిని సేవ్ చేశారు. మిగిలిన ముగ్గురు అయిన పార్వతి, కళ్యాణి, కీర్తనలను ఎలిమినేట్ చేశారు. అయితే ఇక్కడితో వీరి పాటల ప్రస్థానం అయిపోయలేదని.. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీతోపాటు మరిన్ని అవకాశాలు ఉంటాయని శైలజ ట్విస్ట్ ఇచ్చింది.
మొత్తంగా కొద్దిరోజులుగా సాగుతున్న ఈ పాటల ప్రవాహంలో మారుమూలన ఉన్న పేద,సామాన్య కళాకారుల ప్రతిభ వెలుగుచూసింది. వారందరికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు దక్కింది. కానీ అందరూ అభిమానించే పార్వతి లాంటి వారి ఎలిమినేషన్ మాత్రం ఆమె అభిమానుల మనసును గాయపరిచిందనే చెప్పాలి.
Recommended Videos:


