Samantha: సమంత-నాగ చైతన్య విడిపోయి చాలా కాలం అవుతుంది. 2021 అక్టోబర్ లో ఈ జంట అధికారికంగా విడాకులు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించారు. విడాకులకు కారణాలు ఏమిటనేది తెలియదు. అయితే సమంత కార్నర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె మీద దుష్ప్రచారం జరిగింది. సమంతకు ఎఫైర్స్ ఉన్నాయని. ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని. కుటుంబ విలువలు పాటించడం లేదని… ఇలా అనేక రూమర్స్ వినిపించాయి.
సమంత కొన్ని మీడియా ఛానల్స్ మీద కేసులు వేసింది. అలాగే కొన్ని సందర్భాల్లో పరోక్షంగా నాగ చైతన్య మీద కామెంట్స్ చేసింది. విడాకులు తనను అత్యంత వేదనకు గురి చేసినట్లు ఆమె వెల్లడించారు. అప్పట్లో సమంత వరుసగా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లారు. అలాగే ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కి వెళ్లడమైంది. నాగ చైతన్య మీద సమంతకు చాలా కోపం ఉందనేది మాత్రం నిజం. ఆమె మాటలను బట్టి అది అర్థం అవుతుంది.
అయితే అక్కినేని ఫ్యామిలీ హీరోతో ఆమె టచ్ లో ఉంటున్నారని తాజా ఘటనతో తెలిసింది. అక్కినేని అఖిల్ కి సమంత జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు కాగా… సమంత ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ పెట్టింది. నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన సమంత ఆయన తమ్ముడు అఖిల్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని అర్థం అవుతుంది.
గతంలో కూడా అఖిల్ కొత్త సినిమాల విడుదల సమయంలో ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాబట్టి అక్కినేని ఫ్యామిలీకి దూరమైన సమంత అఖిల్ తో స్నేహం కొనసాగిస్తున్నారు. అప్పట్లో అఖిల్ కి సమంత వివాహం చేయాలని చూశారు. ఓ అమ్మాయితో అఖిల్ కి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కొన్ని కారణాల వలన ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. కాగా సమంత వయసు 35 ఏళ్ళు దాటేసింది. ఆమె రెండో వివాహం చేసుకుంటారా లేదా? అనే సందేహాలు ఉన్నాయి. మరోవైపు అఖిల్ కూడా సింగిల్ గానే ఉన్నాడు.
Web Title: Samantha has a close relationship with akhil
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com