RGV- Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఇటీవల రాజకీయ దూకుడు పెంచారు. కొన్నేళ్లుగా ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా స్పందించలేదు. కానీ తనను ప్యాకేజీ స్టార్ అనడంతో పవన్ తన వాయిస్ పెంచారు. ఒక్కసారిగా తన ఆవేశ గొంతుతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. దీంతో జనసేన కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శిస్తుండగా.. మరికొందరు సపోర్టుగా వస్తున్నారు. లేటేస్టుగా పవన్ పై ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు ఇండస్ట్రీ పరంగా.. అటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

సోషల్ మీడియాను బాగా వాడడం నేర్చుకున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. సమాజంలో జరిగే ప్రతీ విషయంపై స్పందిస్తూ ఉంటారు. సంఘటన ఏదైనా ఆయన రెస్పాన్ష్ మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ స్పందన వివాదాస్పదంగా కూడా మారుతుంది. అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినా వర్మ మాత్రం తన స్టైల్ ను మార్చుకోరు. తన దారి తనదే అంటుంటారు. ఇదే క్రమంలో పవన్ విషయంలో నూ ఆర్జీవి కాస్త వ్యతిరేకంగానే ఉంటారు. గతంలో పవన్ పై చేసిన కొన్ని కామెంట్స్ తో ఆయన ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
తాజాగా ఆర్జీవి పవన్ పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈసారి ఆయన తన స్టైల్ మార్చాడు. పవన్ కు సపోర్టుగా మాట్లాడి ఆసక్తిగా మారాడు. ఇటీవల వైసీపీ నాయకులపై పవన్ చేసిన వ్యాఖ్యలను వర్మ వెనుకేసుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ గత వందేళ్లలో నేను విన్న అద్భుతమైన స్పీచ్ లో పవన్ దే నని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో ధర్మం ఉందన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొందరికి అర్థం కాలేదని, కానీ అందులో గుండెల్లో చొచ్చుకుపోయే మాటలు ఉన్నాయన్నారు.

అయితే ఇన్నాళ్లు పవన్ ను ఆడిపోసుకున్న ఆర్టీవీ ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్ త్వరలో సీఎం కాబోతున్నాడని, అందుకే ఆయనకు సపోర్టు చేస్తున్నారని పవన్ ప్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా పవన్ చేసిన ఇదే కామెంట్స్ పై మొన్న శ్రీరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. చెప్పుతో నమస్కారం అంటూ ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి ఎడాపెడా బూతులు తిట్టారు.