Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Maa Reality Show: ‘ మా ’ కష్టాలు.. మనందరికీ నష్టాలు..!! రియాల్టీ షో.. ప్రేక్షకులకు...

Maa Reality Show: ‘ మా ’ కష్టాలు.. మనందరికీ నష్టాలు..!! రియాల్టీ షో.. ప్రేక్షకులకు తలనొప్పులు!

Maa Reality Show: రియాలిటీ షోలకు సంబంధించి స్టార్‌ మాటీవీ అడ్డంగా ఫెయిలైపోతోందిం. ఒక్కటంటే ఒక్క రియాలిటీ షోను కూడా సక్సెస్‌ చేయలేక చతికిల పడుతోంది. కార్యక్రమాల పేరుతో ప్రేక్షకులకు తలనొప్పులు తెప్పిస్తోంది. తాజాగా సూపర్‌ సింగర్‌ జూనియర్‌ అని స్టార్ట్‌ చేశారు. ఆల్‌రెడీ ఈటీవీలో పాడుతా తీయగా ఉంది, స్వరాభిషేకం ఉంది. జీటీవీలో సరిగమప ఉంది. అయినా నాకేం తక్కువ అని మా టీవీ యాజమాన్యం సూపర్‌ సింగర్‌ స్టార్ట్‌ చేసింది.

Maa Reality Show
Super Singer Juniors

ఆదివారంం ఈ షో లాంచ్‌ చేసిందిం అట్టహాసం, ఆడంబరం, కళ్లు చెదిరే రంగుల వెలుతురుం ఈటీవీ నుంచి అంతటి సుడిగాలి సుధీర్‌నే మాటీవీలోకి లాగిపారేశారు. ఓ యాంకర్‌గాం మరో స్టార్‌ యాంకర్‌ అనసూయను తీసుకొచ్చారు. అత్యంత పాపులర్‌ గాయని చిత్ర, మనో, హేమచంద్ర, రాణినారెడ్డి జడ్జిలు పాప్‌ స్టార్‌ ఉషా ఉతుప్, ఫుల్‌ ఆర్కెస్ట్రా, కోరస్‌ టీం అరెరె, ఇంకేం కావాలి..? కానీ షో ఎంత దరిద్రంగా ఉందంటేం ఓ కామెడీ షో చేసేశారు. ఒక పెళ్లి ఈవెంట్‌లా అనిపించిందిం ప్రేక్షకులకు. చివరికి ఆ పిల్ల గాయకులనూ కమెడియన్లుగా మార్చి కుప్పిగంతులు వేయించారు. సూపర్‌ సింగర్స్‌ను ఏదో వినోదపు ఈవెంట్‌లా మార్చిపారేశారు. చివరకు పిల్లలు పాడుతుంటే వెనుక డాన్సర్ల పిచ్చి గెంతులుం అసలు ఇది మ్యూజిక్‌ కంపిటీషనా..? స్టార్‌ మాటీవీ క్రియేటివ్‌ టీం భావదారిద్య్రామా వీక్షకులకు అర్థం కాలేదు. నిజానికి మంగ్లీని అనసూయకు బదులుగా హోస్ట్‌గా తీసుకుంటే బాగుండేది అని వీక్షకులు ఫీల్‌ అయ్యారు.

Also Read: Akira Plays Piano For Mahesh Song: మహేష్ పాటకు… పియానో వాయించిన పవన్ వారసుడు ‘అకీరా’ !

తెలుగు రానివారే యాంకర్లు జడ్జీలు..

Maa Reality Show
Reality Show

సూపర్‌ సింగర్‌ షోకు తెలుగు రాని అనసూయ యాంకర్, జడ్జి ఉషాఉతుప్‌కు తెలుగు రాదు. చిత్రకు కూడా రాదు. ప్రచార ప్రోమోలను బట్టి చూస్తే ఉషా ఉతుప్‌ టెంపరరీ కావచు. సరే, వ్యక్తులు ముఖ్యం కాదు, షో ప్లాన్‌ చేసిన తీరే దరిద్రం షో చేశారు.

జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్‌ నుంచి అందరూ వెళ్లిపోతున్నా సరేం మాటీవీలోకి కామెడీ స్టార్స్‌ తీరం చేరుకుంటున్నా సరే మంచి సీనియర్‌ కమెడియన్లను తీసుకుంటున్నా సరే జబర్దస్త్‌ రేటింగ్స్‌తో పోలిస్తే కామెడీ స్టార్స్‌ సగం రేటింగ్స్‌ కూడా సంపాదించడం లేదు. సుధీర్‌ను ఎలా వాడుకోవాలో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి నేర్చుకోవాలి. ఒక కామెడీ షో చేతకాదు, ఒక మ్యూజిక్‌ షో చేతకాదు.. మరి మా టీవీ రియాలిటీ షో పేరుతో ప్రేక్షకులకు మాత్రం తలనొప్పి పుట్టిస్తోంది అనడంలో సందేహం లేదు!!

Also Read: Ameesha Patel: 46 ఏళ్ల వయసులో ఘాటు ఫోజులు.. ఇది అందాల రచ్చ !

Recommended videos
మహేష్ - త్రివిక్రమ్ మూవీ లో మరో స్టార్ హీరో | Mahesh -Trivikram Movie Latest Update | SSMB28 Update
Sai Kumar Speech at Black Movie trailer Launch || Black Telugu Movie Trailer Launch || Sai Kumar
సుమ 3.0  కామెడీ విత్ ప్రగతి | Suma Making Hillarious FUN With Actress Pragathi Aunty | F3 Pre Event

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version