Ramoji Rao Passed Away: మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు శనివారం కన్నుమూశారు. రామోజీరావు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన టీడీపీ అభ్యర్థి రఘు రామకృష్ణం రాజు రామోజీరావుకు నివాళులు అర్పించారు. ఆయన రామోజీరావుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
రామోజీరావు తన సమాధి ఎక్కడ ఉండాలో ముందే ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారని తెలిపి ఆశ్చర్యానికి గురి చేశారు. రెండు రోజుల క్రితం రామోజీరావు కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు గుండె సంబంధిత సమస్య అని తెలిపారు. సర్జరీ చేసి స్టంట్స్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో డాక్టర్లు వెంటిలేటర్ అమర్చారు.
ఆరోగ్యం మరింత విషమించడంతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావుకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు పంచుకున్నారు. రామోజీరావు గారు తన సమాధి కోసం రామోజీరావు ఫిల్మ్ సిటీ లోని ఓ ప్రదేశాన్ని ఎన్నో ఏళ్ల క్రితమే ఎంపిక చేసుకున్నారని తెలిపారు.
ఆ సమాధి ఓ ఉద్యాన వనంలా మార్చాలని .. ఆయనకు మొక్కలంటే చాలా ఇష్టం అని అన్నారు. కోట్లు ఖర్చుచేసినా రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి దాన్ని సృష్టించడం మాటలు కాదని అన్నారు. అలాంటి పట్టుదల, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు కోటికొక్కరు మాత్రమే ఉంటారని తెలిపారు. ఆంధ్రపదేశ్ ప్రజలను కాపాడాలని ఆయన చేసిన కృషి అద్వితీయం. తెలుగు ప్రజలను కాపాడి తృప్తితో ఆయన కన్ను మూశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అంటూ వీడియో రూపంలో తెలియజేశారు.
జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు గారు.
‘మరణం ఒక వరం’, ‘నాకు చావు భయం లేదు’
–#RamojiRao
#RIPRamojiRao #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/1Mdb1ii0bf— Shreyas Media (@shreyasgroup) June 8, 2024