Rahul Ravindran Controversy: సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ పాపులారిటీని సంపాదించుకున్న హీరోలు సందర్శకులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది… సమాజంలో నివసిస్తున్న చాలామంది జనాలు చాలా సాంప్రదాయాలను, కట్టుబాట్ల లను ఆచరిస్తుంటారు. కాబట్టి వాటి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే మాత్రం అందరి మనోభావాలు దెబ్బతిని చివరికి అది మనకు మైనస్ గా మారే అవకాశాలైతే ఉంటాయి… అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత చి.ల. సౌ మూవీ తో దర్శకుడిగా మారాడు. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి తన ప్రతిభను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈనెల 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రీసెంట్ గా ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్య అయిన సింగర్ చిన్మయి శ్రీపాద ను ఉద్దేశించి రిపోర్టర్ అడిగిన ప్రశ్న కి చాలా దారుణంగా సమాధానం చేశాడు. అసలు క్వశ్చన్ ఏంటంటే. మీ భార్య మెడలో మంగళసూత్రం ఎందుకు వేసుకోదు అని అడగగా దానికి రాహుల్ సమాధానం చెబుతూ ఆమె మెడలో మంగళసూత్రం వేసుకోవడం, తీసేయడం అనేది పూర్తిగా తన ఇష్టమని, అయినా మెడలో మంగళసూత్రం ఉండాలని రూలేమీ లేదు.
మగవాళ్లకు పెళ్లయినట్టుగా ఎలాంటి ఆనవాళ్లు ఉండవు అలాంటప్పుడు ఆడవాళ్లకు మాత్రం పెళ్లయిందని మెడలో మంగళసూత్రాన్ని ఆధారంగా చూపించడం ఎందుకు…ఇది కూడా ఒక రకంగా ఆడవాళ్ళని మనం తక్కువ చేస్తున్నట్టే అంటూ ఆయన మాట్లాడిన మాటల పట్ల చాలామంది వ్యతిరేకత భావాన్ని చూపిస్తున్నారు.
నిజానికి దాన్ని కొన్ని కోట్ల మంది సాంప్రదాయంగా భావిస్తున్నారు. కాబట్టి దాని గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇక కొంతమంది రాహుల్ రవీంద్రన్ ను ఉద్దేశించి మెడలో మంగళసూత్రం లేకపోతే ఆమె నీ పెళ్ళాం అని నువ్వు ఎలా చెప్పగలవు. మెడలో మంగళసూత్రం ఉంచుకోవడం ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవడం దేనికి…
హ్యాపీగా సహజీవనం చేస్తూ ఇద్దరు హాయిగా గడుపుతూ ఉండొచ్చు కదా అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు… మొత్తానికైతే ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ మీద సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేకమైన కామెంట్లైతే వస్తున్నాయి.సినిమా రిలీజ్ పెట్టుకొని రాహుల్ ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు…దీనివల్ల ఆయన మూవీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి…ఇక ఇపుడుస్తున్న వ్యతిరేకత మీద రాహుల్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది తెలిసి ఉంది…