https://oktelugu.com/

Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ వచ్చేస్తుంది… అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బర్త్ డే ట్రీట్!

అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ విడుదల చేస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ ఆసక్తి రేపేదిగా ఉంది. గజ్జ కట్టిన అల్లు అర్జున్ కాలును పోస్టర్ లో పొందుపరిచారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 2, 2024 / 06:16 PM IST

    Pushpa 2 Teaser

    Follow us on

    Pushpa 2 Teaser: ఇది అల్లు అర్జున్ బర్త్ డే మంత్. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ 42వ ఏట అడుగుపెట్టనున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆల్రెడీ వేడుకలు స్టార్ట్ చేశారు. తమ అభిమాన హీరో బర్త్ డేను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇక ఫ్యాన్స్ కోసం బర్త్ డే ట్రీట్ సిద్ధం చేశాడు అల్లు అర్జున్. ఆయన అప్ కమింగ్ మూవీ పుష్ప 2 టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్ చేశాడు. నేడు దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

    అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ విడుదల చేస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ ఆసక్తి రేపేదిగా ఉంది. గజ్జ కట్టిన అల్లు అర్జున్ కాలును పోస్టర్ లో పొందుపరిచారు. పుష్ప 2 మూవీలో జాతర ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు. రాయలసీమలో ఓ దేవత జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఆ జాతర నేపథ్యంలో పుష్ప 2లో ఉంది. అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ వేస్తాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు.

    అమ్మరి వేషంలో అల్లు అర్జున్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఫైట్ థియేటర్స్ లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ కలిగిస్తుందట. ఏప్రిల్ 8న విడుదల కానున్న టీజర్ అప్డేట్ లో అల్లు అర్జున్ అమ్మారు గెటప్ లో ఉన్న ఫోటో వదిలారు. టీజర్ అప్డేట్ పోస్టర్ ఓ రేంజ్ లో ఉంది. కాగా పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ భారీగా నిర్మిస్తున్నాడు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

    2021లో విడుదలైన పుష్ప పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రేజీ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెయ్యి కోట్ల వసూళ్లే టార్గెట్ గా పుష్ప 2 విడుదల కానుంది.