Rajamouli and Allu Aravind: దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. కెరియర్ మొదట్లో మాస్ సినిమాలను చేస్తూ వచ్చిన ఆయన ఆ తర్వాత గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించాడు. అందువల్లే ఆయన ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే మాత్రం ప్రపంచంలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరిలో రాజమౌళి కూడా ఒకరు అనేంతలా గొప్ప పేరును సంపాదించుకుంటాడు… ఇక రాజమౌళి మగధీర సినిమాతో మొదటి ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా సమయంలో ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ తో అతనికి కొన్ని విభేదాలైతే వచ్చాయి…
కారణం ఏంటి అంటే మగధీర సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేద్దాం అని రాజమౌళి చెప్పినప్పటికి అల్లుఅరవింద్ మాత్రం వినలేదట. దాంతో రాజమౌళి కొంతవరకు కోపానికి వచ్చినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. ఇక వీళ్ళ మధ్య ఆ విషయంలోనే కొన్ని ఇష్యూస్ వచ్చాయి. ఆ తర్వాత రాజమౌళి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీని మీద క్లారిటీ ఇచ్చాడు…
అల్లు అరవింద్ తో మరొక సినిమా చేయనని కూడా చెప్పాడు. నిజానికి రాజమౌళి మాట విని మగధీర సినిమాని హిందీలో రిలీజ్ చేసి ఉంటే అప్పట్లోనే అదొక పాన్ ఇండియా సినిమాగా పెను ప్రభంజనాన్ని సృష్టించేది. మొత్తానికైతే రాజమౌళి మాట వినుంటే అల్లు అరవింద్ కి భారీ లాభాలు రావడమే కాకుండా మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాను తీసిన ప్రొడ్యూసర్ గా కూడా అతను గొప్ప గుర్తింపును సంపాదించుకునేవాడు.
అల్లు అరవింద్ మీద కోపంతోనే రాజమౌళి బాహుబలి సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించారంటూ చాలామంది చెబుతూ ఉంటారు. మొత్తానికైతే రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…