Prashanth Verma advance controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న దర్శకులందరు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు…పాన్ ఇండియాలో తమను మించిన దర్శకులు మరెవరు లేరు అనేంత రేంజ్ లో గొప్ప విజయాలను సాధించడానికి మన దర్శకులు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లందరు భారీ విజయాల కోసం పరితపిస్తున్నారు. ఇక హనుమాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రశాంత వర్మ సైతం తన తదుపరి సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ హౌజ్ ను స్టార్ చేసి దాని ద్వారా కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తద్వారా దర్శకుడిగా అతనికి అడ్వాన్స్ ఇచ్చిన కొన్ని ప్రొడక్షన్ హౌస్ ల నుంచి అతనికి మా సినిమాలు ఎప్పుడు చేస్తావ్ అంటూ కొన్ని వేధింపులైతే ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తోడుగా ప్రశాంత్ వర్మ వాటి పట్ల ఎలాంటి స్పందనను తెలియజేయకపోవడంతో వాళ్ళు వీలైనంత తొందరగా ఎలక్షన్ కౌన్సిల్లో ప్రశాంత్ వర్మ మీద కంప్లైంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ విషయం మీద భారీ ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి అతనికి అడ్వాన్సులు ఇచ్చినట్టుగా కొన్ని వార్తలైతే వచ్చాయి…అందులో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి కూడా కొన్ని అడ్వాన్సులు అందాయని వాళ్ళు కూడా ప్రశాంత్ వర్మ తో అడ్వాన్స్ వెనక్కి ఇవ్వమంటు ఇబ్బంది పెడుతున్నారు అనే ధోరణిలో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక దీని మీద డివివి వెంటనే దానయ్య స్పందించాడు.
దానికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేశారు…ప్రశాంత్ వర్మ కి మేము ఎలాంటి అడ్వాన్స్ ఇవ్వలేదని, అతన్ని మేము ఏ రకంగానూ ఇబ్బంది పెట్టడం లేదని, అతనితో సినిమా చేయాలని గతంలో అనుకున్నప్పటికి అడ్వాన్సులు మాత్రం ఇవ్వలేదని అని చెప్పాడు.
దీంతో ప్రశాంత్ వర్మ బాధితులలో డివివి వాళ్ళు లేరనే క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం డివివి బ్యానర్ మీద నాని సుజీత్ సినిమా పట్టలెక్కుతోంది…ఇక రీసెంట్ గా ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించిన డివివి సంస్థ తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
— DVV Entertainment (@DVVMovies) October 31, 2025