https://oktelugu.com/

Prashanth Neel: సలార్ 2 షూట్ ఎప్పుడు ఉండబోతుందో క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్…

ప్రస్తుతం ఆయన సలార్ 2 సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దానికోసమే స్క్రిప్ట్ ని కూడా చాలా పకడ్బందీగా రాసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 25, 2024 / 06:11 PM IST

    Prashanth Neel

    Follow us on

    Prashanth Neel: రాజమౌళి తర్వాత పాన్ ఇండియా సినిమాలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్… పాన్ ఇండియా లో ఈయన చేసిన కేజిఎఫ్ సిరీస్ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ఎవరికి లేనంత గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. అలాగే సలార్ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని 800 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టడమే కాకుండా తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా బాగా డీల్ చేశాడనే పేరు కూడా తెచ్చుకున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన సలార్ 2 సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దానికోసమే స్క్రిప్ట్ ని కూడా చాలా పకడ్బందీగా రాసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సలార్ సినిమా నుంచే సలార్ 2 ను డిజైన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో పాన్ ఇండియా లెవల్లో చూపించుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా లో మూడు సినిమాలను చేస్తే ఆ మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లు సాధించడం విశేషం… ఇక ఆయన దర్శకత్వం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ను సలార్ లో ఎలాగైతే ఒక యాక్షన్ హీరోగా చూపించాడో సెకండ్ పార్ట్ లో కూడా తను అలాంటి బీభత్సమే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ సినిమాకి సంబంధించిన షూట్ ఎప్పుడు ఉంటుంది అని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సమ్మర్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆలోపు ప్రభాస్ స్పిరిట్ సినిమాని అలాగే హను రాఘవపూడి సినిమాని కంప్లీట్ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఈ సంవత్సరం పాటు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… మరి సలార్ 2 సినిమా వచ్చిన తర్వాత ఇండస్ట్రీ లో ఏ ఒక్క రికార్డు కూడా మిగిలి ఉండదని ప్రశాంత్ నీల్ ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. చూడాలి మరి ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడు అనేది…