Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Prabhas- Ghost: దెయ్యంగా నటించబోతున్న ప్రభాస్..పాపం అభిమానుల రియాక్షన్ ఏమిటో!

Prabhas- Ghost: దెయ్యంగా నటించబోతున్న ప్రభాస్..పాపం అభిమానుల రియాక్షన్ ఏమిటో!

Prabhas- Ghost: టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది..ఆయన రేంజ్ టాలీవుడ్ ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళిపోయింది..బాహుబలి సిరీస్ తో ఆయన తెచ్చుకున్న క్రేజ్ అలాంటిది మరి..కానీ ఆ తర్వాత ఆయన నుండి వచ్చిన సాహూ మరియు రాధే శ్యామ్ వంటి సినిమాలు అభిమానుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలయ్యాయి..ప్రభాస్ అభిమానులకు ఇప్పుడు అర్జెంటు గా వాళ్ళ అభిమాన హీరో నుండి బాహుబలి రేంజ్ సక్సెస్ కావాలి.

Prabhas- Ghost
Prabhas

వాళ్ళ ఎదురు చూపులు మొత్తం సలార్ ,ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్ K వంటి భారీ బడ్జెట్ సినిమాల వైపే ఉన్నాయి..కానీ ఎవ్వరు ఊహించని విధంగా మధ్యలో మారుతీ తో ప్రభాస్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చి చేరింది..ప్రభాస్ ఫాన్స్ కి ఈ ప్రాజెక్ట్ మీద ఎలాంటి ఆసక్తి లేదు..మా హీరో ని దయచేసి వదిలేయి అంటూ ట్విట్టర్ లో మారుతిని ట్యాగ్ చేసి ప్రభాస్ అభిమానులు ట్రెండ్ కూడా చూసారు.

కానీ అభిమానులు ఎంత గింజుకున్నా హీరో నిర్ణయమే ఫైనల్..ప్రభాస్ మారుతీ తో సినిమా చెయ్యడానికే సిద్ధం అయ్యాడు..ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది..ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహన్ లు నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడు..ఇది ఇలా ఉండగా ఈ సినిమా కథకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

Prabhas- Ghost
Prabhas

అదేమిటి అంటే ఈ చిత్రం లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట..అందులో ఒక పాత్ర దెయ్యం పాత్ర అట..ఇంకో ప్రభాస్ శరీరం లోకి ఆ ఆత్మా వెళ్తుందట..ప్రభాస్ లాంటి స్టార్ ఇమేజి ఉన్న హీరో కి ఇలాంటి పాత్రలు ఎలా సూట్ అవుతాయి అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు..కానీ డైరెక్టర్ మారుతి ఈ కథని ప్రభాస్ ఇమేజి కి తగ్గట్టుగానే టేకింగ్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది..నిధుల అన్వేషణ నేపథ్యం లో ఈ కథ సాగుతుంది అట..అంటే గోపీచంద్ సాహసం మూవీ సినిమాలాగా అన్నమాట..దానితో హారర్ కూడా ఉంటుంది..చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ని మారుతీ ప్రభాస్ అభిమానులకు మరియు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఎలా తీస్తాడు అనేది.

రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో మల్టీస్టారర్ || Ram Charan, Allu Arjun Multi-Strarrer || Geetha Arts
https://youtu.be/2z4-K6DA9Jk
రాంచరణ్ మరో సరికొత్త రికార్డ్ || Ram Charan New Sensational Record || Oktelugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version