https://oktelugu.com/

Salaar: సలార్ ఖాతాలో వరస్ట్ రికార్డ్…మరి ఇంత దారుణం ఏంటి భయ్యా..?

ప్రస్తుతం కల్కి, రాజా సాబ్ లాంటి రెండు భారీ ప్రాజెక్టులతో ఈ సంవత్సరం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే సలార్ సినిమా పేరు మీద ఒక వరస్ట్ రికార్డ్ అయితే నమోదు అయింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 4, 2024 / 08:30 AM IST

    Salaar

    Follow us on

    Salaar: ప్రతి ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోలు ఉంటారు. వాళ్ళ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ సినిమాలు చూడడానికి విపరీతమైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ నటించిన సలార్ సినిమా గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.

    అయితే ఈ సినిమా సాధించిన ప్రభంజనం ముందు మరే సినిమా నిలబడలేకపోయింది. ఇక ఆ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఈ సినిమా ఒకటిగా నిలవడం అనేది నిజంగా విశేషం అనే చెప్పాలి. ఇక ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందనే చెప్పాలి. ఇక ఇలాంటి నేపథ్యంలో ఈయన ప్రస్తుతం కల్కి, రాజా సాబ్ లాంటి రెండు భారీ ప్రాజెక్టులతో ఈ సంవత్సరం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే సలార్ సినిమా పేరు మీద ఒక వరస్ట్ రికార్డ్ అయితే నమోదు అయింది.

    అది ఏంటి అంటే ఇప్పటివరకు టెలివిజన్ చరిత్రలోనే థియేటర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిన సినిమాకి అత్యంత తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం అనేది సలార్ విషయంలోనే జరిగింది. నిజానికి ‘భగవంత్ కేసరి’ సినిమాకి మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు 9.36 రేటింగ్ నమోదైంది. ఇక రీసెంట్ గా ‘గుంటూరు కారం’ సినిమాకి కూడా 9.25 రేటింగ్ అయితే నమోదైంది. మరి ఇలాంటి క్రమంలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ హీరోగా వచ్చిన స్కంద సినిమా 8.15 టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసుకుంది.

    కానీ సలార్ సినిమాకి మాత్రం కేవలం 6.15 రేటింగ్ మాత్రమే రావడం ప్రభాస్ అభిమానుల్లో తీవ్రమైన కలవరానికి గురయ్యేలా చేస్తుందనే చెప్పాలి.
    ఇక ఇప్పటికి ఈ సినిమా తన ఖాతాలో ఒక వరస్ట్ రికార్డ్ ను వేసుకుందనే చెప్పాలి. థియేటర్ లో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన సలార్ సినిమా టీవీలో మాత్రం ప్లాప్ అయిందనే చెప్పాలి..