Prabhas-Prashanth Varma Movie Update: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఆయన హీరో గా నటించిన ‘రాజా సాబ్’ చిత్రం షూటింగ్ చివరి అంచుల్లో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, బయ్యర్స్ డిసెంబర్ కంటే సంక్రాంతికి రావడం బెటర్ అని చెప్పడం తో జనవరి 9 కి వాయిదా వేశారు. ఈ చిత్రానికి సంబంధించి కేవలం పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంది. వాటి కోసం మేకర్స్ లొకేషన్స్ ని వెతికే పనిలో ఉన్నారు. మరో పక్క ప్రభాస్ సమాంతరంగా హను రాఘవపూడి తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ఆయన సందీప్ వంగ స్పిరిట్ చిత్రానికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. చేతిలో ఉన్న ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యాక ఆయన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తో ఒక సినిమా చేయబోతున్నాడు.
రీసెంట్ గానే ప్రశాంత్ వర్మ దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరయ్యాడు. అక్కడ ఒక యాంకర్ ప్రశాంత్ వర్మ తో ఇంటర్వ్యూ చేస్తూ ప్రభాస్ తో మీరు చేయబోయే సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది అని అడగ్గా, దానికి ప్రశాంత్ వర్మ సమాధానం చెప్తూ ‘అదొక రెబలియస్ ప్రాజెక్ట్. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఈ సినిమా మొదలు అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా లో ప్రభాస్ ని పూర్తి స్థాయి నెగటివ్ క్యారక్టర్ లో చూపించబోతున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మన పురాణాల్లో బకాసురుడు గురించి మన చిన్న తనం నుండి వింటూనే ఉన్నాం. ఆయన జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొనే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమాకు ‘బక’ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
ప్రభాస్ ఏంటి?, బకాసురుడు ఏంటి?, ప్రశాంత్ వర్మ కి బుర్ర పని చేస్తుందా ?, అసలు ఏమి చెయ్యాలని అనుకుంటున్నాడు?, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్ తో ఇలాంటి ప్రయోగాలు చేసి, పొరపాటున అవి వికటిస్తే కెరీర్ మొత్తం రిస్క్ లో పడే ప్రమాదం ఉంది. అయితే బకాసురుడు లీడ్ క్యారక్టర్ కాబట్టి, ఆయన పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఇతివృత్తం మొత్తం చూపిస్తే కచ్చితంగా వర్కౌట్ అవ్వుధి అనే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ వర్మ. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ‘హనుమాన్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ ఇప్పుడు జై హనుమాన్ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి ఆయన బాలయ్య కొడుకు మొదటి సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. ఆ ప్రాజెక్ట్ కి బదులుగా జై హనుమాన్, ఆ తర్వాత ప్రభాస్ సినిమాకు రెడీ అవుతున్నాడు ప్రశాంత్ వర్మ.