SIIMA Awards 2025: ప్రతీ ఏడాది దుబాయి లో ఎంతో గ్రాండ్ గా సైమా అవార్డ్స్(SIIMA Awards 2025) ఫంక్షన్ ని ఏర్పాటు చేసే విషయం తెలిసిందే. సౌత్ ఇండియా లో ఉన్న ప్రముఖ నటీనటులంతా ఈ వేదికని పంచుకొని, వివిధ క్యాటగిరీలలో అవార్డ్స్ ని అందుకుంటుంటారు. అలా గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన సినిమాలకు, అందులో నటించిన నటీనటులకు అవార్డ్స్ ని ప్రకటించారు. గత ఏడాదికి గానూ అవార్డ్స్ ని అందుకున్న ప్రముఖ స్టార్స్ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం పదండి.
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్(Icon Star Allu Arjun):
గత ఏడాది పుష్ప 2 చిత్రం తో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి వారం లోనే వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఫుల్ రన్ లో ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అద్భుతమైన నటన, మ్యానరిజమ్స్. ఆయనకు ఈ అవార్దుకి నూటికి నూరు శాతం అర్హుడు. అందులో ఎలాంటి సందేహం లేదు.
ఉత్తమ చిత్రం – కల్కి 2898 AD(Kalki 2898 AD):
ప్రభాస్(Rebel Star Prabhas), నాగ అశ్విన్(Naga Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం గత ఏడాది సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామీ ని అంత తేలికగా మరచిపోలేము. క్వాలిటీ కి పరాకాష్ట గా నిల్చిన ఈ సినిమాని థియేటర్స్ లో చూస్తున్నంతసేపు మనం ఒక కొత్త లోకంలోకి ప్రవేశించినట్టుగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా అనిపించింది. గడిచిన రెండు దశాబ్దాలలో ఇలాంటి కాన్సెప్ట్ పై ఇప్పటి వరకు ఎవ్వరూ సినిమాలు తెరకెక్కించలేదు. టాలీవుడ్ లో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఉత్తమ చిత్రం క్యాటగిరీ లో అవార్దు రావడం ఆనందించాల్సిన విషయం.
ఉత్తమ విలన్ – కమల్ హాసన్(Kamal Haasan) :
ప్రభాస్ ‘కల్కి’ చిత్రం లో సుప్రీమ్ యాస్కిన్ గా కమల్ హాసన్ తన విలనిజం తో ఆడియన్స్ ఎలా భయపెట్టాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ఆయన కనిపించింది కేవలం 7 నిమిషాలు మాత్రమే. కానీ ఆ 7 నిమిషాల్లోనే ఆయన వణుకుపుట్టించే రేంజ్ విలనిజం ని పండించాడు. ఆయనకు ఈ అవార్దు రావడం పై అందరూ సంతోషిస్తున్నారు.
ఉత్తమ నటి – రష్మిక(Rashmika Mandanna) :
గత ఏడాది విడుదలైన ‘పుష్ప 2’ చిత్రం లో రష్మిక నటన అల్లు అర్జున్ కి ఏ మాత్రం తీసిపోని విధంగానే ఉన్నింది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో ఆమె పెర్ఫార్మన్స్ అద్భుతం అనే చెప్పాలి. ఆమెకు ఈ అవార్దు దక్కడం నూటికి నూరు పాళ్ళు న్యాయమే.
ఉత్తమ దర్శకుడు – సుకుమార్(Sukumar) :
ఇండియా లో ఒక బ్రాండ్ గా మారిన పుష్ప సృష్టికర్త ఆయన. నటీనటుల నుండి తనకు కావాల్సిన నటనని రాబట్టుకోవడం, అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ఉత్కంఠ గా సినిమాని ప్రేక్షకులు చూసేలా చేయడం లో సుకుమార్ మరోసారి తాను సిద్ధహస్తుడు అని నిరూపించుకున్నాడు.
అంతా బాగానే ఉంది కానీ, ప్రతీసారి హీరో ప్రభాస్ కి అవార్డ్స్ విషయం లో అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు ప్రభాస్ అభిమానులు. బాహుబలి సిరీస్ లో అద్భుతంగా నటించినప్పటికీ ఒక్క అవార్దు కూడా రాలేదు. కనీసం కల్కి చిత్రనికైనా వస్తుందని అనుకున్నారు, కానీ ఇక్కడ కూడా ఆయనకు అన్యాయమే జరిగిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి ప్రభాస్ కి అన్యాయం జరిగిందని మీరు కూడా అనుకుంటున్నారా?, మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపం లో తెలియజేయండి.