Prabhas: ఆ ఇద్దరి మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభాస్…

కల్కి సినిమా లో తను వాడే వాహనమైన బుజ్జి ని జనానికి చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక అందులో భాగంగానే రామోజీ ఫిలిం సిటీ లో ఒక ఈవెంట్ ని కూడా కండక్ట్ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడాడు.

Written By: Gopi, Updated On : May 23, 2024 9:40 am

Prabhas

Follow us on

Prabhas: మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన ప్రస్తానాన్ని మొదలు పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తనదైన రీతిలో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటూన్నాయి. ఇక మొత్తానికైతే ప్రభాస్ ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే కల్కి సినిమా లో తను వాడే వాహనమైన బుజ్జి ని జనానికి చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక అందులో భాగంగానే రామోజీ ఫిలిం సిటీ లో ఒక ఈవెంట్ ని కూడా కండక్ట్ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడాడు.. ఇక తను అభిమానించే హీరోలు అయిన కమలహాసన్, అమితబచ్చన్ గారు అంటే నాకు చాలా ఇష్టం..అలాంటిది వాళ్ళిద్దరూ నా సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది నిజంగా మంచి విషయం అంటూ తను అమితాబచ్చన్, కమల్ హాసన్ గురించి తెలియజేశాడు. అంటే ముఖ్యంగా అమితాబచ్చన్ కి ఫ్యాన్స్ అవ్వని వారంటూ ఎవరు ఉండరు ఆయన యాక్టింగ్ ను చూసే మనం యాక్టింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాం.

కాబట్టి ఆయన గొప్ప నటుడు ఆయనను మించిన నటులు ఇండస్ట్రీ లో మరొకరు లేరని చెప్పాడు. ఇక అలాగే కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ ఈయన అద్భుతమైన నటనను కనబరచడమే కాకుండా నా చిన్నతనంలో ఆయన చేసిన ‘సాగర సంగమం’ సినిమాలో ఆయన వేసుకున్న డ్రెస్ నాకు కావాలని నేను చాలా గొడవ చేశాను. నాకు కమలహాసన్ గారు అంటే చాలా ఇష్టం.

ఇక అలాంటిది ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం…ఇక ఇంతటి అవకాశాన్ని కల్పించిన ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ లకి థాంక్స్ చెప్తున్నాను అంటూ ప్రభాస్ అటు కమలహాసన్, ఇటు అమితాబచ్చన్ మీద కామెంట్స్ చేయడం అనేది ప్రస్తుతం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి…