Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Varinder Chawla: తెలుగులో ఉన్న ఈ ముగ్గురు స్టార్ హీరోలకు ఈగో ఎక్కువ ఉంటుంది అంటున్న...

Varinder Chawla: తెలుగులో ఉన్న ఈ ముగ్గురు స్టార్ హీరోలకు ఈగో ఎక్కువ ఉంటుంది అంటున్న బాలీవుడ్ ఫోటోగ్రాఫర్…

Varinder Chawla: తెలుగు సినిమా హీరోల పైన బాలీవుడ్ వాళ్లు మొదటి నుంచి కూడా పలు రకాల విమర్శలను చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు మన హీరోలు బాలీవుడ్ హీరోలను తొక్కేస్తూ ముందుకు సాగుతున్నారనే ఒకే ఒక ఉద్దేశ్యంతో మన వాళ్ళ మీద మరింత విమర్శలు చేయడానికి అక్కడి మీడియా గాని, హీరోలు గాని, ఆర్టిస్టులు గాని, టెక్నీషియన్స్ గానీ రెడీగా ఉంటున్నారు.

ఇంకా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎలాగైనా సరే తొక్కేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది వాళ్ల వల్ల అవ్వడం లేదు. ఇక మన హీరోలు ప్రతి సినిమాతో తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి బాలీవుడ్ వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అందుకనే ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన ‘వీరేందర్ చావ్లా’ తెలుగు హీరోల పైన కొన్ని కామెంట్లైతే చేశాడు. అదేంటి అంటే తెలుగు సినిమా హీరోలు పైకి బిల్డప్ లు ఇస్తూ లోపల మాత్రం చాలా ఇగో పెట్టుకొని ఉంటారు.

పైకి మాత్రమే వాళ్లు చాలా మంచి వాళ్ళలా నటిస్తారు అంటూ తను కామెంట్లైతే చేశాడు. ఇక దాంతో పాటుగా విజయ్ దేవరకొండ అనే ఒక హీరో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చెప్పులు వేసుకొని వచ్చాడు. అది చూసిన చాలామంది ఆయన చాలా సింపుల్ గా ఉంటాడు అంటూ ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఆయన జనాల మధ్య అలా నటిస్తున్నాడు పర్సనల్ గా వేరే రకంగా ఉంటారు. అది ఎవరికి తెలియదు అంటూ కామెంట్లైతే చేశాడు. అలాగే ఎన్టీఆర్ ను ఉద్దేశిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ ఒక పబ్లిక్ పార్టీకి వచ్చినప్పుడు తన తోటి ఫోటోగ్రాఫర్ ఎన్టీఆర్ ఫోటో తీసినందుకు ఆయన అతని మీద చాలా ఫైర్ అయ్యారని ఎన్టీఆర్ కూడా పైకి మాత్రమే జనాల్లో నటిస్తాడు. లోపల మాత్రం తనకు చాలా ఇగో ఉంటుందని చెప్పాడు.

ఇక అలాగే మహేష్ బాబు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ తో తనకు సంబంధం లేదని తెగేసి చెప్పాడని ఆయనకు చాలా ఆటిట్యూడ్ ఉంటుందని కూడా చెప్పడం విశేషం.. ఇక ఇంకా తను మాట్లాడుతూ బాలీవుడ్ హీరోలు పైకి ఒకలా లోపల మరొకలా ఉండరు. వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉంటారు కానీ తెలుగు హీరోలు మాత్రం లోపల ఒకటి పెట్టుకొని, పైకి మంచి వాళ్ల లా నటిస్తూ ఉంటారు అంటూ వీరేందర్ కామెంట్లు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది…ఇక దీనికి కౌంటర్ గా మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఘాటు కామెంట్లు చేస్తున్నారు…

RELATED ARTICLES

Most Popular