Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan new movie update: ఉగాది నుండి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా మొదలు..పూర్తి...

Pawan Kalyan new movie update: ఉగాది నుండి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా మొదలు..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

Pawan Kalyan new movie update: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ ఈ చిత్రం కోసం రెడీ చేసినదే అట. ఇప్పటికే ‘ఓజీ’ చిత్రం లో ముంబై గ్యాంగ్ స్టర్ గా కనిపించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. తనని నేటి తరం ఆడియన్స్ ఇలాంటి రోల్స్ లో చూడాలని కోరుకుంటున్నారు
Pawan Kalyan new movie update: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు వచ్చే నెల డబుల్ ధమాకా అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ మార్చి 26 న విడుదల అవ్వబోతుంది, అదే నెలలో ఆయన కొత్త సినిమా కూడా ప్రారంభం కాబోతుంది. ఉగాది కానుకగా మార్చి 19న పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ మొదటి వారం నుండి మొదలు కాబోతుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి రామ్ తాళ్ళూరి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో చాలా భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న అట.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ ఈ చిత్రం కోసం రెడీ చేసినదే అట. ఇప్పటికే ‘ఓజీ’ చిత్రం లో ముంబై గ్యాంగ్ స్టర్ గా కనిపించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. తనని నేటి తరం ఆడియన్స్ ఇలాంటి రోల్స్ లో చూడాలని కోరుకుంటున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్, అదే తరహా సినిమాని ఎంచుకున్నాడు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ‘ఓజీ’ కి పదింతలు ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుంటుంది అని అంటున్నారు ఫ్యాన్స్. ఆ స్థాయి ఈ సినిమాకు ఉందని బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి గా చాలా బిజీ గా ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎలా చేస్తాడు అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.
అయితే ఆయన తన పని దినంలో ఒక 6 నుండి 7 గంటల వరకు ఈ సినిమా షూటింగ్ కి సమయం కేటాయిస్తాడని, మిగిలిన సమయం పాలనకు కేటాయిస్తాడని తెలుస్తోంది. ఆయన ఇచ్చే ఈ టైం పగలు సమయం అవ్వొచ్చు, రాత్రి సమయం కూడా అవ్వొచ్చని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో నటించే నటీనటుల వివరాలు కూడా త్వరలోనే తెలియచేస్తారట. ఒక పాపులర్ హీరో ఇందులో విలన్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎవరు?, ఏంటి? అనేది త్వరలోనే తెలుస్తుంది. ఈ ఏడాది లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.
Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version