Homeఎంటర్టైన్మెంట్Actor Chandrahass: అటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కు ఘోర అవమానం.. వైరల్ వీడియో

Actor Chandrahass: అటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కు ఘోర అవమానం.. వైరల్ వీడియో

Actor Chandrahass: సినిమా అనేది ఒక రంగులలోకం. అందులో నటించే వారంతా డెమీ గాడ్స్ మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాము మాత్రమే గొప్ప వాళ్ళమని.. మిగతా వారంతా ఎందుకూ పనికి రానివారని అనుకుంటారు. అందువల్లే సినిమా పరిశ్రమను చూసి.. అందులో నటిస్తున్న వారిని చూసి చాలామంది ప్రేరణ పొందుతూ ఉంటారు. సినిమా పరిశ్రమలోకి వెళ్లాలని.. సినిమా నటులం కావాలని చాలామంది తాపత్రయపడుతుంటారు.
ఇప్పుడు సోషల్ మీడియా కాలం.. ఎంత ప్రచారం జరిగితే అంత లాభం. అందువల్లే చాలామంది విచిత్రమైన చర్యలకు పాల్పడి సోషల్ మీడియాలో రీచ్ కావాలని కోరుకుంటారు. దీనికి చిత్రపరిశ్రమలో పనిచేసే నటులు.. ఇతర వ్యక్తులు మినహాయింపు కాదు.
సోషల్ మీడియాలో రీచ్ కోరుకోవడం వేరు. మీడియా అటెన్షన్ సొంతం చేసుకోవడం వేరు. విభిన్నమైన పనులు చేసి మీడియాలో నానుతూ ఉండాలి. సోషల్ మీడియాలో నిత్యం చర్చలో ఉండాలి. అయితే కొంతమంది చెత్త పనులు చేసి సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవుతున్నారు. మీడియాలో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ముందుగానే చెప్పుకున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కాబట్టి.. సంచలనానికి మాత్రమే ప్రాధాన్యం ఉంటోంది.
బరాబర్ ప్రేమిస్తా అనే ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్. ఇతడికి ఆల్రెడీ ఆటిట్యూడ్ స్టార్ట్ అనే పేరు ఉంది. మాట్లాడే విధానం తెలియదు. ఎలా ఉండాలో అర్థం కాదు. మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు కనీసం ఎలాంటి హావభావాలు ప్రదర్శించాలో కూడా ఇతడికి అర్థం కాదు. అటువంటి ఈ వ్యక్తి ఇటీవల తన సినిమాకు సంబంధించి ఏదో పాటను విడుదల చేశాడు. అందులో బండ బూతులు ఉన్నాయి. చెప్పడానికి వీల్లేని.. రాయడానికి వీల్లేని భాషలో ఉన్నాయి. ఆ పాటను అతడు పాడటం మాత్రమే కాదు.. ఇలాంటి పాట ఎందుకు రాశారు అని అడిగితే వితండవాదం చేస్తున్నాడు. బెదిరింపులకు పాల్పడుతున్నాడు. చివరికి ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా బరితెగింపు చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి సినిమా హీరో కావడం ఒక దరిద్రమైతే.. అతడిని కొన్ని మీడియా సంస్థలు మోయడం మరింత దరిద్రం. అతడి బండబూతుల పాట విడుదలైన తర్వాత ఓ డిజిటల్ మీడియా న్యూస్ ఛానల్ అతనితో ఇంటర్వ్యూ కూడా చేసింది. అతడి పొగరు చూసి యాంకర్ కు విసుగు పుట్టింది. దీంతో అతనికి అనేక సందర్భాలలో హెచ్చరికలు కూడా జారీ చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version