Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ ఇమేజ్ కు తగ్గ కథలను ఎంచుకొని సినిమాలు గా చేస్తూ సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ కి కొంచెం తక్కువగా సినిమాలు ఉన్నా కూడా వాళ్ళ ఫాన్స్ గాని, సగటు ప్రేక్షకులు కానీ వారిని ఆదరిస్తారో లేదో అనే ఉద్దేశ్యంతోనే సెక్యూర్ జోన్ లో ఉండే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతారు…ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలు ప్రయోగాలు చేయకపోవడానికి ముఖ్య కారణం కూడా ఇదే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక స్టార్ హీరోలు ఎప్పుడూ ఒక సెక్యూర్ జోన్ లోనే ఉంటూ మంచి కలెక్షన్స్ సాధించే సినిమాలను చేసి ప్రేక్షకులను మెప్పించాలని చూస్తుంటారు. కానీ కొన్నిసార్లు కొంతమంది హీరోల విషయంలో ఇదే మైనస్ కూడా అవుతుంది. మరి కొంతమంది మాత్రం కొత్త కథలను ఎంచుకొని సక్సెస్ లను కొడుతుంటే, కొంతమంది హీరోలు మాత్రం రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ఫ్లాప్ లను కూడా అందుకుంటున్నారు… ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ కు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. ఆయన ఏకకాలంలో ఇటు పాలిటిక్స్ ను, అటు సినిమాలని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. గత పది సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్న పవన్ కళ్యాణ్ మొత్తానికైతే ఈ సంవత్సరం తను అనుకున్నది సాధించినట్టుగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 21 స్థానాలను గెలిపించుకొని 100% స్ట్రైక్ రేటుతో ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. అలాగే రెండు ఎంపీ స్థానాలను పోటీ చేస్తే అందులో కూడా విజయం సాధించడం ఒక గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయానికి వస్తే సినిమా తప్ప వేరే బిజినెస్ లు లేని పవన్ కళ్యాణ్ ఒక టైమ్ లో తన పార్టీని నడిపించుకోవడానికి సినిమాలు చేయాల్సి వచ్చింది. ఇక అందులో భాగంగానే కొన్ని కథలను కూడా ఎంచుకొని సినిమాలుగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో గత సంవత్సరం వచ్చిన ‘బ్రో ‘ సినిమా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇక తమిళంలో సముద్రఖని డైరెక్షన్ లో వచ్చిన ‘వినోదయ్య సీతమ్ ‘ సినిమాని తెలుగులో ‘బ్రో ‘ పేరుతో రీమేక్ చేశారు. ఇక ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించాడు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమా కథని రీ రైట్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కి డబ్బులు అవసరం ఉన్న క్రమంలో అలాగే తన డేట్స్ ని కూడా ఎక్కువగా కేటాయించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సినిమాకి తను కమిట్ అయి ఈ సినిమాని చేసినట్టుగా తెలుస్తుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఇమేజ్ ప్రకారం చూసుకుంటే అసలు ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే తన ఇమేజ్ ను తగ్గించుకొని పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయడం చూసిన అభిమానులు ఈ సినిమాని అంత బాగా రిసీవ్ చేసుకోలేకపోయారు.
కేవలం పవన్ కళ్యాణ్ పార్టీని నడపడానికి మాత్రమే ఈ సినిమా చేశారని మనందరికి అర్థం అయిపోయింది. అయినప్పటికీ తన అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఆయనకి అండగా నిలబడడానికి ఒకటికి రెండుసార్లు వాళ్ళు థియేటర్లో ఈ సినిమాను చూసిన కూడా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది…