https://oktelugu.com/

Superstar Krishna: ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఒకపుడు కృష్ణ ఉండేవాడు.. అలా ఇప్పుడు ఎవ్వరు లేరా..?

Superstar Krishna: సినిమా సినిమాకి మధ్య వేరియేషన్ చూపిస్తూ అన్ని జానర్స్ లలో సినిమాలను చేశాడు. కృష్ణ లాంటి దైర్యం ఉన్న హీరో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎవరు లేకపోవడం బాధాకరమైన విషయమనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : January 19, 2024 1:29 pm
    Krishna experimental films
    Follow us on

    Superstar Krishna: ప్రస్తుతం తెలుగులో కొంతమంది యంగ్ హీరోలు వైవిధ్యాన్ని చూపించుకుంటూ మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడున్న ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా ప్రయోగాత్మమైన సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించడం లేదు.

    నిజానికి ఒకప్పుడు కొంతమంది హీరోలు ఎక్స్పరమెంట్లు చేసి మంచి సక్సెస్ లను అందుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకుండా మూస ధోరణిలో సినిమాలు చేయడానికి అలవాటు పడిపోయి అవే కథలను ఎంచుకుంటూ రొటీన్ సినిమాలుగా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మాత్రం చాలా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు, అలాగే సక్సెస్ లను కూడా దక్కించుకున్నాడు.

    సినిమా సినిమాకి మధ్య వేరియేషన్ చూపిస్తూ అన్ని జానర్స్ లలో సినిమాలను చేశాడు. కృష్ణ లాంటి దైర్యం ఉన్న హీరో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎవరు లేకపోవడం బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఒక స్టార్ హీరో ఒక కథని నమ్మి ఆ సినిమా ని సక్సెస్ ఫుల్ గా చేయగలిగితే అలాంటి ఇంకా చాలా కొత్త కథలు ఇండస్ట్రీలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలా కాకుండా మన హీరోలు నాలుగు ఫైట్లు, ఐదు పాటలతో సినిమా మొత్తం లాగించేస్తున్నారు. ఇంకా సీనియర్ హీరోలైన నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు సైతం మూస ధోరణి లోనే వెళ్తున్నారు. ఇక వీళ్ళ సినిమాలు చూసిన ప్రేక్షకులకు తెలుగు సినిమా అంటే విరక్తి పుట్టి మలయాళం సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్లు మంచి కథలను ఎంచుకొని మంచి సినిమాలు చేస్తు ముందుకు కదులుతున్నారు కాబట్టి వాళ్ల సినిమాలు జనాలకి ఎక్కువగా నచ్చుతున్నాయి. ఇక మన వాళ్లు కూడా మలయాళం సినిమాల దారిలోనే మంచి సినిమాలు చేస్తూ మంచి స్టోరీలు తీసుకురావాలని మన ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఇక ఇంతకు ముందు మన హీరోలు కొన్ని ప్రయోగాలు చేసి ప్లాప్ లను మూట గట్టుకున్నారు.

    దాంతో ప్రయోగాలు చేయడం వేస్ట్ అని రొటీన్ సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అయితే ప్రయోగం చేసినప్పుడు దాన్ని సక్సెస్ ఫుల్ గా చేయాలి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ మిస్టేక్ లేకుండా చేసినప్పుడు ఆ సినిమా ఎందుకు ప్లాప్ అవుతుంది అంటూ అభిమానులు కూడా ఈ విషయం లో మేకర్స్ ని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయంలో స్టార్ హీరోలు వాళ్ల అభిమానుల మీద తప్పంతా నెట్టేసి మేము అలా కనిపిస్తే ప్రేక్షకులు, మా అభిమానులు ఆదరించరు అని చెబుతూ వారిని వాళ్ళు సేఫ్ జోన్ లోకి నెట్టేసుకుంటున్నారు. నిజానికి ప్రేక్షకుడు అన్ని రకాల సినిమాలను ఆదరిస్తాడు. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎందుకు రిజెక్ట్ చేస్తారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…అయితే చేసే ప్రయోగం లో క్వాలిటీ ఉండేలా చేసి చూపిస్తే ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది…