Homeఎంటర్టైన్మెంట్Peddi movie advance bookings: 'ఓజీ', 'దేవర' ఓపెనింగ్స్ ని అందుకోవడం 'పెద్ది' కి కష్టమేనా..?...

Peddi movie advance bookings: ‘ఓజీ’, ‘దేవర’ ఓపెనింగ్స్ ని అందుకోవడం ‘పెద్ది’ కి కష్టమేనా..? ప్రస్తుత అడ్వాన్స్ గ్రాస్ ఎంతంటే..

Peddi movie advance bookings: మరో 17 రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు దాదాపుగా ఏడాది పాటు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎందుకంటే గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చరణ్ ఫ్యాన్స్ ని తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయేలా చేసింది. అలాంటి సినిమా తర్వాత తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ‘పెద్ది’ పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు ఆ చిత్రం నుండి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కూడా హిట్ అవ్వడంతో , రామ్ చరణ్ ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడని అందరూ ఫిక్స్ అయ్యారు.

అభిమానులు అయితే ఓజీ, దేవర రికార్డ్స్ ని అవలీలగా దాటేస్తాము అంటూ సోషల్ మీడియా లో సవాళ్లు కూడా విసిరారు. కానీ ప్రస్తుతానికి ఈ సినిమాకు జరుగుతున్న ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే, ఆ రేంజ్ కి వెళ్లడం చాలా కష్టమే అనిపిస్తోంది. ఓవర్సీస్ లో బుకింగ్స్ ని మొదలు పెట్టి దాదాపుగా 10 రోజులు కావొస్తుంది , కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం కేవలం బుకింగ్స్ ద్వారా కేవలం 4 లక్షల డాలర్లు మాత్రమే రాబట్టింది. అందులో కేవలం నార్త్ అమెరికా నుండి 3 లక్షల డాలర్లు వచ్చాయి. నార్త్ అమెరికా మన టాలీవుడ్ కి కంచుకోట లాంటిది. ఇక్కడ దేవర చిత్రం 2.6 మిలియన్ డాలర్ల గ్రాస్ ని ప్రీమియర్ షోస్ నుండి రాబడితే , ఓజీ చిత్రం 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఓజీ చిత్రానికి దాదాపుగా 25 థియేటర్స్ లో ఆల్ టైం రికార్డ్స్ కూడా నమోదు అయ్యాయి.

ఆ చిత్రానికి ఉన్న డిమాండ్ కి తగ్గ షోస్ ని షెడ్యూల్ చేసుంటే 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టి ఉండేది , కానీ మేకర్స్ సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్ళకపోవడం వల్ల 3.1 మిలియన్ డాలర్ల వద్దనే ఆగిపోయింది. అయితే ‘పెద్ది’ కి ప్రస్తుతం నడుస్తున్న ఊపుని చూస్తుంటే , 2 మిలియన్ డాలర్ల గ్రాస్ కి ఒక్క రూపాయి కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఇది కూడా నేడు విడుదల అవ్వబోయే థియేట్రికల్ ట్రైలర్ ఆకట్టుకుంటేనే. ఇక ప్రస్తుతం ఉన్న డిమాండ్ ని బట్టి చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 120 నుండి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చేలాగా అనిపిస్తున్నాయి. ఓజీ, దేవర చిత్రాలకు వరల్డ్ వైడ్ గా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ‘పెద్ది’ చిత్రం క్రేజ్ రాబోయే రోజుల్లో పెరగొచ్చు , తగ్గొచ్చు ఏదైనా జరగొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version