Devara Movie: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇండస్ట్రీకి చేసిన సేవలు తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతవరకు గుర్తుండిపోతాయి. ఇక తెలుగు సినిమా చరిత్రలోనే ఇటు సినిమాల్లో హీరోగా చేసి, అటు రాజకీయ పార్టీ పెట్టి ఒక రాష్ట్రానికి సీఎం అయిన ఏకైక వ్యక్తి కూడా రామారావు గారే కావడం విశేషం..ఇక ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీ కి వచ్చిన బాలయ్య బాబు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే రాజకీయంగా కూడా చాలా బిజీగా కొనసాగుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు కదులుతున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన దేవర సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక తొందర్లోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ చాలా కసరత్తులను చేస్తున్నారు. ఈ సినిమాతో కనక జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన రెండు రికార్డులను బ్రేక్ చేసినవాడు అవుతాడు. అది ఏంటి అంటే ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎవరు కూడా వరుసగా ఏడు సక్సెస్ లని సాధించలేదు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిని మినహాయిస్తే గోకులంలో సీత నుంచి ఖుషి వరకు ఆయన చేసిన ఆరు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.
ఇక ఆ తర్వాత జానీ సినిమాతో ఫ్లాప్ అయితే వచ్చింది. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ టెంపర్ నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు వరుసగా 6 విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు కనక దేవరతో సక్సెస్ అందుకుంటే పవన్ కళ్యాణ్ రికార్డును బ్రేక్ చేసి వరుసగా ఏడు విజయాలను అందుకున్న ఏకైక తెలుగు స్టార్ హీరోగా గుర్తింపైతే పొందుతాడు. ఇక దాంతో పాటుగా రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చేసిన తర్వాత ఆ హీరో చేసిన నెక్స్ట్ సినిమా డిజాస్టర్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక నమ్మకం అయితే ఉంది.
ఇక రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా చేసిన తర్వాత ఆచార్య సినిమాలో నటించి భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాతో సక్సెస్ సాధిస్తే రాజమౌళితో సినిమా చేసి ఆ తర్వాత సినిమాతో కూడా హిట్ కొట్టిన ఏకైక స్టార్ హీరోగా కూడా హిస్టరీలో నిలుస్తాడు. కాబట్టి దేవర సినిమా సక్సెస్ అనేది ఇప్పుడు ఎన్టీఆర్ కు చాలా కీలకంగా మారబోతుంది…