https://oktelugu.com/

Nidhhi Agerwal: నటుడితో లవ్ బ్రేకప్… షాకింగ్ నిర్ణయం తీసుకున్న నిధి అగర్వాల్!

బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన మున్నా మైఖేల్ సినిమాతో పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య కు జంటగా సవ్యసాచి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 22, 2024 / 06:35 PM IST

    Nidhhi Agerwal

    Follow us on

    Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం బ్రేకప్ బాధలో ఉన్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు ఓ బాలీవుడ్ నటుడి ప్రేమలో మునిగితేలిన భామ, విబేధాలు రావడంతో విడిపోయినట్లు సమాచారం. ఈ పరిణామం తర్వాత ఆమె జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ హాట్ బ్యూటీ తీసుకున్న డెసిషన్ ఏంటో ఈ స్టోరీ లో తెలుసుకుందాం.

    బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన మున్నా మైఖేల్ సినిమాతో పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య కు జంటగా సవ్యసాచి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ నిధి అగర్వాల్ గ్లామర్, నటనకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లో నటించి సక్సెస్ కొట్టింది. ఆపై తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది.

    కానీ సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో ఈ బ్యూటీ కి కాస్త ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ మూవీ హరి హర వీరమల్లు చేస్తుంది. ఎన్నికల నేపథ్యంలో హరి హర వీరమల్లు ఆలస్యం అవుతుంది. అయితే రాజా సాబ్ మూవీలో నిధి నటిస్తోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఓ లీడ్ హీరోయిన్ గా నిధి ఉండబోతుందని సమాచారం. కాగా మరోవైపు నిధి అగర్వాల్ బ్రేకప్ రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

    నటుడితో ఆమె ప్రేమ వ్యవహారం బెడిసికొట్టినట్టు వినికిడి. ప్రియుడు గురించి కొన్ని చేదు నిజాలు తెలియడంతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. విరక్తి చెందిన నిధి అగర్వాల్ షాకింగ్ డెసిషన్ తీసుకుందట. ఈ ప్రేమ, గీమా ఏం లేదంటూ .. ఇలాంటివన్నీ పక్కన పెట్టాలని అనుకుంటుందట. ఇకపై తన పూర్తి దృష్టి కెరీర్ పై ఉంచి ముందుకు వెళ్లానని నిధి అగర్వాల్ నిర్ణయించుకున్నారని న్యూస్ వైరల్ వైరల్ అవుతుంది.