Nuvvu Naaku Nachav: 5 నిమిషాల సీన్ షూట్ చేయడం కోసం 5 నెలల టైమ్ తీసుకున్న డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సక్సెస్ అయిన, ఫెయిల్యూర్ అయిన జస్ట్ కొద్దిరోజులు మాత్రమే గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీ అవ్వాల్సిందే..ఎవరికి వారు మళ్లీ తమ తర్వాత సినిమా సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలి అనేదాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

Written By: Gopi, Updated On : June 23, 2024 8:49 am

Nuvvu Naaku Nachav

Follow us on

Nuvvu Naaku Nachav: సినిమా ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం 200 సినిమాల వరకు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక అందులో కొన్ని సినిమాలు సక్సెస్ అవుతుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ ని సాధించిన కూడా ఆయా నటులు గాని, దర్శకులు గానీ, నిర్మాతలు గాని ఇంకో కొత్త సినిమాతో బిజీ అయిపోతుంటారు.

సక్సెస్ అయిన, ఫెయిల్యూర్ అయిన జస్ట్ కొద్దిరోజులు మాత్రమే గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీ అవ్వాల్సిందే..ఎవరికి వారు మళ్లీ తమ తర్వాత సినిమా సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలి అనేదాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే నిత్యం జీవితంతో పాటు పోరాటం చేసే వాళ్లే సినిమా ఇండస్ట్రీ లో ఉంటారు…ఇక ఇదిలా ఉంటే మనకు స్క్రీన్ మీద కనిపించే సీన్ మొత్తం మనం ఒకేసారి షూట్ చేశారు అనుకుంటాం. కానీ ఒక దర్శకుడు ఒక సీన్ ను ఐదు నెలల పాటు చిత్రీకరించారనే విషయం మనలో చాలా మందికి తెలియదు.

నిజానికి ఒక సీన్ అంటే ఒక నిమిషంలోనో, రెండు నిమిషాలల్లోనో అయిపోతుంది. కానీ దాన్ని తీయడానికి దాని బ్యాక్ ఎండ్ లో ఆ సినిమా యూనిట్ వాళ్ళు ఎన్ని నెలల నుంచి కష్టపడతారో ఆ సినిమా చూసే వాళ్ళేవ్వరికి తెలియదు. నిజంగా సినిమా తీయడం అంటే చాలా కష్టం. కానీ ఆ సినిమా సక్సెస్ అయితే సంతోషం. ఫెయిల్యూర్ అయితే కొద్దిగా బాధపడాల్సిన అవసరమైతే ఉంటుంది. అసలు విషయంలోకొస్తే విజయ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాలో ప్రకాశ్ రాజ్ తన తల్లి గురించి కవిత్వం చెప్పే సీన్ ను చూసి మనందరం నవ్వుకుంటాం..నిజానికి సినిమాలో ఆ మొత్తం ఎపిసోడ్ అంత ఒక ఐదు నిమిషాల పాటు ఉంట్టుంది. కానీ దానిని 5 నెలల పాటు చిత్రీకరించారట.

ఎందుకు అంటే దాంట్లో ఎమ్మెస్ నారాయణ , ప్రకాష్ రాజ్, వెంకటేష్, సుధా లాంటి స్టార్ యాక్టర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ల డేట్స్ అందరివి ఒకేసారి దొరకలేదట. ఎవరికి వారు ఎవరి సినిమాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉండడం వల్ల వాళ్ల డేట్స్ దొరికిన సమయంలో కొంచెం కొంచెం చిత్రీకరించారట. అందువల్లే ఆ సీన్ ను చిత్రీకరించడానికి దాదాపు 5 నెలల సమయం పట్టిందని ఒక ఇంటర్వ్యూలో విజయభాస్కర్ చెప్పడం విశేషం…