Nag Ashwin: శ్రీ నారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం @లవ్. కాగా నేడు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ లాంచ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలను పెంచుతుంది. సినీ లవర్స్ కూడా ఈ సినిమా పై చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా అడవి నేపథ్యంలో ఇదివరకు ఎవరూ టచ్ చెయ్యని థీమ్ తో రాబోతుంది.

శ్రీ నారాయణ రాసిన కథాకథనాలే ఈ సినిమాకు ప్రధాన బలం. ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘శ్రీ నారాయణ ఎక్కడా కథను ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. అనాగరిక చర్యల వల్ల కోల్పోయిన జీవితాల్ని.. ఆ జీవితాల పై ఆధారపడ్డ నమ్ముకున్న బతుకుల బాధలను వారి బావోద్వేగాలను.. హృదయానికి హత్తుకున్నేలా చాలా చక్కగా చూపించారు.
రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి శ్రీ నారాయణ నే కావడం సినిమాకి బాగా ప్లస్ అయింది. తను రాసుకున్నది.. అంతే పర్ఫెక్ట్ గా తీశాడు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. మరీ ఓ విభిన్నమైన కథ కథనాలతో సహజత్వానికి దగ్గరగా రాబోతున్న ఈ సరికొత్త చిత్రం హిట్ అవుతుందా ? చూడాలి.

ఇన్నాళ్ళు గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమా నాగ్ అశ్విన్ కి చాలా బాగా నటించిందట. తనను ఎంతగానో ఆకట్టుకుందని..నాగ్ అశ్విన్ చెప్పారు. ‘మంచి సినిమా రావడం లేదు అని బాధ పడేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించే సినిమా ఇది అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.
నాగ్ అశ్విన్ ఈ చిత్రం గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చూశాక, తెలుగు సినిమాను కూడా ఇంత సహజంగా తీస్తారా అనిపిస్తుంది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని ఈ సినిమాలో చూపించిన విధానం అద్భుతమైనది. ప్రతి పాత్రకు ఒక కథ ఉంటుంది. అసలు ఇలాంటి ప్రేమ కథలో అద్భుతమైన ఎమోషన్స్ ను పెట్టడం నిజంగా అద్భుతం’ అంటూ నాగ్ అశ్విన్ చెప్పారు.