Macherla Niyojakavargam Movie Review: నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా తదితరులు.
దర్శకుడు: ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
సంగీత దర్శకులు: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ఎం.ఎస్ రాజాశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సినిమా “మాచర్ల నియోజకవర్గం”. ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్‌లుగా నటించారు. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ :
‘మాచర్ల నియోజకవర్గం’లో రాజప్ప (సముద్రఖని) ఎన్నో ఘోరాలు చేస్తూ ఉంటాడు. అక్కడ అతను చెప్పిందే శాసనం. ప్రభుత్వాలు కూడా అతన్ని ఏం చేయలేవు. దాంతో ఎలక్షన్సే లేకుండా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉంటాడు. మరోపక్క సిద్దార్థ్ రెడ్డి (నితిన్) సివిల్స్ లో టాపర్ గా వస్తాడు. పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో స్వాతి (కృతి శెట్టి)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమెను రాజప్ప మనుషులు చంపడానికి ప్రయత్నం చేస్తారు. అసలు స్వాతి ఎవరు ?, రాజప్ప కి స్వాతికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?, ఈ నాటకీయ పరిణామాల మధ్య గుంటూరు జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన సిద్దార్థ్ రెడ్డి ఏం చేశాడు ?, రాజప్ప అన్యాయాలను ఎలా ఎదిరించాడు ? చివరకు సిద్దార్థ్ రెడ్డి అనుకున్నది సాధించాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ సినిమాలో నితిన్ తన పాత్రలో తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే, నితిన్ బాడీ లాంగ్వేజ్ కి, అతని పాత్ర సెట్ కాలేదు. డామినేట్ చేసే క్యారెక్టరైజేషన్ మాడ్యులేషన్ తో తన పాత్రకు నితిన్ నటన పరంగా పర్ఫెక్ట్ న్యాయం చేసినా.. ఇమేజ్ పరంగా తేలిపోయాడు. ఇక హీరోయిన్ పాత్రలో ఓకే ఎమోషన్ తో సాగే కృతి శెట్టి నటన జస్ట్ పరవాలేదనిపిస్తుంది. అలాగే హీరోతో సాగే ఆమె భావోద్వేగ సీన్స్ కూడా బాగాలేదు.

ఇక విలన్ పాత్రలో నటించిన నటుడు సముద్రఖని ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్స్ ను తన ఫిజిక్ ను చాలా బాగా మార్చుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే, ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ వైవిధ్యమైనా.. ఇంట్రస్ట్ గా సాగదు. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మంచి కథా నేపథ్యం రాసుకున్నప్పటికీ ఆసక్తికరమైన కథనంతో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. ఈ చిత్రం చూస్తున్నంత సేపు రెగ్యులర్ యాక్షన్ డ్రామాలు గుర్తుకు వస్తాయి. అన్నిటికీ మించి సినిమాలో గుర్తు ఉండిపోయే ఒక్క ఎమోషన్ కూడా బలంగా ఎలివేట్ కాలేదు.
ప్లస్ పాయింట్స్ :
నితిన్ నటన,
నేపథ్య సంగీతం,
కథా నేపథ్యం
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ క్రైమ్ ప్లే,
రొటీన్ యాక్షన్ డ్రామా,
హీరో ఓవర్ బిల్డప్,
లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,
డైరెక్షన్ స్కిల్స్
సినిమా చూడాలా ? వద్దా ?
మొత్తంగా సింగిల్ పాయింట్ లో చెప్పుకుంటే.. సినిమాలో మ్యాటర్ కంటే, బిల్డప్ ఎక్కువ అయ్యింది. పైగా రొటీన్ యాక్షన్ డ్రామా వ్యవహారాలతో సాగుతూ.. ఈ సినిమా బాగా బోర్ కొడుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించదు.
రేటింగ్ : 2.25/ 5
బోటమ్ లైన్ : స్లోగా సాగే ఎమోషనల్ బోరింగ్ పొలిటికల్ డ్రామా
Also Read:Senior NTR- ANR: వేదిక పై కృష్ణుడిగా ఎన్టీఆర్.. ఏఎన్నార్ మాటలకు ఊగిపోయిన ప్రేక్షకులు
[…] Also Read: Patriotism: దేశంలో దేశభక్తే ఇప్పుడు రాజకీయ స… […]