Indian Idol Telugu : నిత్యా మీనన్ ని పెళ్లి చేసుకోవడానికి సింగర్ చేసిన పని థమన్ మైండ్ బ్లాక్… తెలుగు ఇండియన్ ఐడల్ లో అనూహ్య పరిణామం!

జడ్జి నిత్యామీనన్ కి టెండర్ పెట్టాడు ఓ యంగ్ సింగర్. ఆమెను పెళ్లి చేసుకోవడానికి మంచి స్కెచ్ వేశాడు. సదరు సింగర్ తీరుకు అక్కడే ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ షాక్ అయ్యాడు. తెలుగు ఇండియన్ ఐడల్ షో వేదికగా జరిగిన ఈ పరిణామం ఆసక్తి రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written By: S Reddy, Updated On : July 27, 2024 6:05 pm
Follow us on

Indian Idol Telugu :  సంగీత దర్శకుడు థమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఓజీ, గేమ్ చేంజర్, రాజాసాబ్ వంటి ప్రాజెక్ట్స్ తో థమన్ ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాలే కాదు అటు షోలు కూడా చేస్తున్నారు. ఓ సింగింగ్ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు ఎంటర్టైన్మెంట్ ఓటీటీ యాప్ ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆహా లో రన్ అవుతుంది.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్స్ గీతా మాధురి, కార్తీక్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ షోలో ఓ కంటెస్టెంట్ ని థమన్ సరదాగా ఆటపట్టించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతుంది. ఒక కంటెస్టెంట్ పాట పడటానికి స్టేజ్ పైకి వస్తాడు. ఆ వ్యక్తి విజయవాడ నుంచి వచ్చానని చెప్పుకొస్తాడు. సదరు సింగర్ జడ్జి సీట్ లో ఉన్న నిత్య మీనన్ ని ఇంప్రెస్స్ చేసే ప్రయత్నం చేశాడు. మేడం నేను మీ కోసం గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చాను అని ఆ సింగర్ చెబుతాడు.

అయితే నిత్యామీనన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. నేను గోల్డ్ షాప్ లో పని చేస్తాను అని ఎదో చెప్పబోతుంటే .. ఇంతలో థమన్ అందుకుని షాప్ లో నుంచి కొట్టుకొచ్చేశావా అంటూ పంచ్ వేస్తాడు. నేను సేవింగ్స్ చేసి మీ కోసం కొన్నాను. మీరు 10 ఏళ్ల క్రితం చెప్పారు కదా .. ఎవరైతే గోల్డ్ బ్యాంగిల్స్ కొనిస్తారో వాళ్లని పెళ్లి చేసుకుంటాను అని .. అందుకే గోల్డ్ బ్యాంగిల్స్ తెచ్చాను మేడం అంటూ ఆ కంటెస్టెంట్ చెప్పుకొస్తాడు.

దీంతో నిత్యామీనన్ నవ్వేసింది. రా వచ్చి ఇచ్చేయ్ .. చేతులకు కూడా నువ్వే వేసేయ్. నిత్య – చంద్ర కిషన్ చాలా బాగుంది పెయిర్ అంటూ జోక్ చేశాడు థమన్. ఇక చివర్లో ఏం పాట పాడబోతున్నావ్ అని థమన్ అడగ్గా .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలోని సాంగ్ అని చంద్ర కిషన్ అంటాడు. ఇక్కడ కూడా బ్యాచిలరేనా ఇదేదో చాలా తేడాగా ఉంది అంటూ తన ఎక్సప్రెషన్స్ తో థమన్ నవ్వులు పూయించాడు.

అయితే ఈ వీడియో ఇండియన్ ఐడల్ సీజన్ 1 కి సంబంధించినది. ఆ సీజన్ లో హీరోయిన్ నిత్యామీనన్, థమన్, సింగర్ కార్తీక్ జడ్జెస్ గా ఉన్నారు. అప్పటి త్రో బ్యాక్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ లో సింగర్ వాగ్దేవి విన్నర్ గా నిలిచింది. మెగా స్టార్ చిరంజీవి విజేతకు టైటిల్ అందించారు. ఇక రెండవ సీజన్ కి జడ్జిలుగా గీతామాధురి, థమన్, కార్తీక్ ఉన్నారు. సీజన్ 2 విజేతగా నిలిచిన సౌజన్య కు అల్లు అర్జున్ ట్రోఫీ అందించారు. సీజన్ 3 విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.