Naga Chaitanya: నాగ చైతన్య – సమంతల విడాకుల విషయం టాలీవుడ్ లో హట్ టాపిక్‌గా మారింది. విడాకుల ప్రకటన కి ముందు , తర్వాత కూడా వీరి విడాకుల అంశం గురించే సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వారు విడిపోవడానికి గల కారణాలను సమంత కానీ , నాగ చైతన్య కానీ తెలుపకపోవడంతో… వారు విడిపోవడానికి కారణలు ఇవే అంటూ ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. ముఖ్యంగా సమంతకు పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని, ఇప్పటికే పలుమార్లు అబార్షన్ చేయించుకుందని అంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో సమంత సోషల్ మీడియా వేదికగా అసత్య వార్తలు రాసే వారిపై ఫైర్ అయిన విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో వారిపై మీడియా ఫోకస్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. చైతన్య , సమంత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతూ షూటింగ్ లలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సమంతతో విడాకుల తర్వాత చైతన్య ఒంటరిగా ఉండాలనీ కోరుకుంటున్నారట… అందులో భాగంగా ఆయన హైదరాబాద్‌లో ఓ కాస్లీ ఏరియాలో ఓ కొత్త ఫ్లాటు తీసుకున్నట్లు సమాచారం. ఇక నుంచి ఆయన అక్కడే ఒంటరిగా ఉంటారని చైతూ సన్నిహితులు చెబుతున్నారు. చైతన్య గత సంవత్సరం జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ బంగ్లాకు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ పనులు పూర్తయిన తర్వాత, చైతన్య ఎంతో ఇష్టపడి కొన్న ఆ బంగ్లాకు మారతారని తెలుస్తోంది.
ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే… ఇటీవల ఆయన నటించిన లవ్ స్టోరి సూపర్ హిట్ విజయం సాధించగా … మంచి కలెక్షన్ లతో దూసుకుపోతుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ సినిమాలో చైతూ నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చైతన్య ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.