Raj Tarun: రాజ్ తరుణ్ పెద్ద ప్లే బాయ్ అంటుంది మాజీ ప్రేయసి లావణ్య. అతడికి అనేక మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని ఆమె ప్రధాన ఆరోపణ. తాజాగా ఆమె బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ పేరు తెరపైకి తెచ్చింది. అరియనాతో కూడా రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని, ఈ విషయం స్వయంగా రాజ్ తరుణ్ మేనేజర్ నాకు తెలియజేశాడని అంటుంది. లావణ్య హీరో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనతో 11 ఏళ్ళు సహజీవనం చేసిన రాజ్ తరుణ్ వదిలించుకోవాలని చూస్తున్నాడు. లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు.
తిరగబడరసామీ మూవీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. అందుకే నన్ను దూరం పెడుతున్నాడు. మాకు పెళ్లి కూడా జరిగింది. డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాడని… లావణ్య పలు ఆరోపణలు చేసింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ఆమె ఆరోపణలు ఖండించాడు. లావణ్యతో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే. కానీ ఆమెతో విడిపోయి చాలా కాలం అవుతుంది. అలాగే ఆమెను పెళ్లి చేసుకోలేదు. మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. ఆమెకు మరొక అబ్బాయితో ఎఫైర్ ఉంది. డ్రగ్స్ తీసుకుని నన్ను టార్చర్ పెట్టేది. ఈ కేసును నేను లీగల్ గా ఎదుర్కొంటాను… అన్నారు.
తాజాగా లావణ్య మరిన్ని ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ ఫేమ్ అరియనాతో రాజ్ తరుణ్ కి ఎఫైర్ ఉందని సంచలన కామెంట్స్ చేసింది. రాజ్ తరుణ్-అరియనా ఒక్క రోజు షూట్ మాత్రమే చేశారు. ఆ పరిచయంతో ఎఫైర్ పెట్టుకున్నాడు. నేను ఒక కోర్స్ నేర్చుకోవడానికి మూడు నెలలు గోవా వెళ్ళాను. అప్పుడు అరియనాకు దగ్గరయ్యాడు. ఈ విషయాన్ని రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు. లేకపోతే రాజ్ తరుణ్-అరియనా ఎఫైర్ నాకు తెలిసేది కాదు. రాజ్ తరుణ్ కి చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉంది… అని లావణ్య అన్నారు.
ఈ ఆరోపణల్లో నిజం ఎంతో తెలియదు కానీ.. రాజ్ తరుణ్ ఒక ప్లే బాయ్ అన్నట్లు ఆమె ప్రొజెక్ట్ చేస్తుంది. కాగా రాజ్ తరుణ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. మొదట్లో రాజ్ తరుణ్ వరుస విజయాలు అందుకున్నాడు. టైర్ టు హీరోగా సెటిల్ అవుతాడని అందరూ భావించారు. వరుస పరాజయాలతో కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. రాజ్ తరుణ్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. విడుదలకు సిద్ధం అవుతున్న తిరగబడరసామీ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు.
Web Title: Lavanya made sensational comments that raj tarun is having an affair with ariana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com