https://oktelugu.com/

Kavya Maran: మైదానంలో.. కావ్య ఆనందానికి అవధులు లేవు.. వైరల్ వీడియో

175 పరుగులు చేసేందుకు హైదరాబాద్ జట్టు తీవ్రంగా శ్రమించింది. ఆటగాళ్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం కావడంతో, ఆ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 25, 2024 / 02:23 PM IST

    Kavya Maran

    Follow us on

    Kavya Maran: చెపాక్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు చరిత్ర సృష్టించింది. బలమైన రాజస్థాన్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించి ఫైనల్ దూసుకెళ్లింది. 8 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ జట్టు ఫైనల్ వెళ్ళింది. ఆదివారం చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ కప్ కోసం కోల్ కతా జట్టుతో తలపడుతుంది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ అన్ని విభాగాలలో అద్భుతమైన ప్రదర్శన చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సత్తా చాటింది. గురువారం రాత్రి వర్షం కురవడంతో.. శుక్రవారం చెన్నై మైదానం మందకోడిగా మారింది. దీంతో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు ఒక మోస్తరుగా బ్యాటింగ్ చేసింది. 9 వికెట్లకు 175 రన్స్ చేసింది. క్లాసెన్ 50, రాహుల్ త్రిపాఠి 37, హెడ్ 34 పరుగులు చేసి.. హైదరాబాద్ స్కోర్ లో కీలకపాత్ర పోషించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3, ట్రెంట్ 3, సందీప్ శర్మ రెండు వికెట్లు తీశారు.

    175 పరుగులు చేసేందుకు హైదరాబాద్ జట్టు తీవ్రంగా శ్రమించింది. ఆటగాళ్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం కావడంతో, ఆ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది. మార్క్రం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అబ్దుల్ సమద్ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. ఒకానొక దశలో పటిష్టంగా ఉన్న హైదరాబాద్.. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో 175 పరుగులకే పరిమితం కావలసి వచ్చింది.. రాజస్థాన్ బ్యాటర్ల ఫామ్ చూస్తే.. ఈ స్కోరును హైదరాబాద్ బౌలర్లు కాపాడుకుంటారా అనే సందేహం ఏర్పడింది. కానీ ఆ సందేహాన్ని హైదరాబాద్ బౌలర్లు పటా పంచలు చేశారు. లక్ష్య చేదనలో రాజస్థాన్ జట్టును 139 పరుగులకే పరిమితం చేశారు.. జురెల్ 56*, యశస్వి జైస్వాల్ 42 మాత్రమే రాజస్థాన్ జట్టులో రాణించారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ మూడు వికెట్లు తీసి రాజస్థాన్ జట్టు పతనాన్ని శాసించారు. నటరాజన్, కమిన్స్ చెరో వికెట్ తీశారు.

    ఈ విజయం నేపథ్యంలో హైదరాబాద్ సహాయజమాని కావ్య మారన్ ఆనందంలో తేలిపోయింది. హైదరాబాద్ విజయాన్ని పురస్కరించుకుని గాలిలో ఎగిరి సంబరాలు జరుపుకుంది. తన నమ్మకాన్ని ప్లేయర్లు కాపాడారన్నట్టుగా సంబరాలు చేసుకుంది. జట్టు గెలవడంతో.. ఆ శుభ సందర్భాన్ని పక్కనే ఉన్న తన తండ్రి కళానిధి మారన్ తో పంచుకుంది. అతడికి కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపింది.. కావ్య మారన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సమయంలో హైదరాబాద్ జట్టు కప్ గెలిస్తే ఆ ఆనందం కావ్య ముఖంలో చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.