Janhvi Kapoor: జాన్వీ కపూర్ మరోసారి దొరికేసింది.. ఈసారి ఏకంగా ప్రూఫ్ కూడా చూపించింది..

జాన్వి కపూర్ అప్పట్లో "కాఫీ విత్ కరణ్" అనే కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ "నీ స్పీడ్ డయల్ లిస్టులో ఎవరు ఉంటారు" అని ప్రశ్నించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 11, 2024 8:54 am

Janhvi Kapoor

Follow us on

Janhvi Kapoor: జాన్వి కపూర్.. శ్రీదేవి, బోని కపూర్ కూతురుగా త్వరగానే బాలీవుడ్ లో అవకాశాలు లభించినప్పటికీ.. తన ఓన్ టాలెంట్ తో సినిమాలు చేసుకుంటూ వస్తోంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర, రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమాలో నటిస్తోంది. తన తండ్రి బోని కపూర్ నిర్మించిన మైదాన్ అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొంటున్నది. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇటీవల ప్యాంట్, సూట్ వేసుకొని మీడియా ప్రతినిధులతో మాట్లాడింది. ఆమె వేసుకున్న డ్రెస్ కంటే.. ఆమె మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ ను అందరూ ప్రత్యేకంగా చూశారు. ఎందుకంటే ఆ నెక్లెస్ పై “షికు” అనే పేరు ఉండడాన్ని చాలామందికి గమనించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

జాన్వి కపూర్ అప్పట్లో “కాఫీ విత్ కరణ్” అనే కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ “నీ స్పీడ్ డయల్ లిస్టులో ఎవరు ఉంటారు” అని ప్రశ్నించాడు. దానికి జాన్వి తండ్రి పేరు, చెల్లి పేరు, షికర్ పేరు చెప్పింది. వెంటనే “ఇప్పటికే చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పాను.. మీరు అర్థం చేసుకోండి” అంటూ కరణ్ జోహార్ కు హింట్ కూడా ఇచ్చేసింది. జాన్వి, షికర్ ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు. తరచూ ఇద్దరు కలిసి ఆలయాలకు వెళ్తుంటారు. మీడియా ఫోకస్ చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోరు. ఇటీవల వీరిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో వీరి మధ్య సీనియర్ నటి మహేశ్వరి (శ్రీదేవికి చెల్లెలు) కూడా ఉంది. అయితే తన బంధంపై వీరిద్దరూ ఎప్పుడు కూడా పెదవి విప్పలేదు. ఇక వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనే తీరుగా వార్తలు రోజుకో తీరుగా బయటికి వస్తూనే ఉన్నాయి.

జాన్వి కపూర్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అధునాతన దుస్తులు ధరించి ఫోటోషూట్ లో పాల్గొంటుంది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. జాన్వి కపూర్ కు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.. ఇక మధ్య షికర్ గురించి బోని కపూర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. “అతడు నాకు బాగా నచ్చుతాడు. అతడి స్నేహం బాగుంటుంది. మా కుటుంబం కోసం అతడు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాడు. అటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఉండడం ఆనందాన్ని కలిగిస్తోంది” అని వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి జాన్వి, శికర్ లవ్ కు బోనికపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతానికి తన కెరియర్లో బిజీబిజీగా ఉన్న జాన్వి త్వరలోనే శికర్ తో కలసి ఏడడుగులు వేస్తుందనే ప్రచారం కూడా జరుగుతున్నది.