https://oktelugu.com/

Venkatesh: ఆ సూపర్ హిట్ సినిమాకు వెంకటేష్ ఇప్పుడు సీక్వెల్ చేయనున్నాడా..?

డాన్స్ సరిగా వేయడం లేదు, డైలాగ్ డెలివరీ అస్సలు బాలేదు అంటూ పలు విమర్శలను ఎదుర్కొన్న వెంకటేష్... ఎలాగైనా సరే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశ్యంతో దృఢ సంకల్పంతో కష్టపడి ఆ తర్వాత బెస్ట్ యాక్టర్ గా ఎదిగాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 19, 2024 / 06:28 PM IST

    Venkatesh

    Follow us on

    Venkatesh: రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ మొదట్లో చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆయన యాక్టింగ్ సరిగ్గా చేయడం లేదు, డాన్స్ సరిగా వేయడం లేదు, డైలాగ్ డెలివరీ అస్సలు బాలేదు అంటూ పలు విమర్శలను ఎదుర్కొన్న వెంకటేష్… ఎలాగైనా సరే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశ్యంతో దృఢ సంకల్పంతో కష్టపడి ఆ తర్వాత బెస్ట్ యాక్టర్ గా ఎదిగాడు.

    ఎవరైతే తనను విమర్శించారో ఆ తర్వాత వాళ్లే అతనితో సినిమా చేయడానికి పోటీపడ్డారు. ఇలాంటి వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ని అభిమానులుగా సంపాదించుకొని వాళ్ళను థియేటర్ కి రప్పించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మరి వెంకటేష్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఒక సినిమా మాత్రం ఆయనకి ఎప్పటికీ స్పెషల్ గా గుర్తుండిపోతుందట. ఇక ఆ సినిమా ఏంటి అంటే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, అసిన్ హీరోయిన్ గా వచ్చిన ఘర్షణ…నిజానికి ఇది ఎప్పటికి ఒక క్లాసికల్ మూవీ గానే మిగిలిపోతుంది. అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్స్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చిన కూడా దానికి ఘర్షణ సినిమానే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఒక నలుగురు పోలీస్ ఆఫీసర్స్ కలిసి కొన్ని కేసులను ఎలా సాల్వ్ చేశారు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక మొదట గౌతమీనన్ తమిళంలో సూర్య జ్యోతికలను పెట్టి ‘ఖాకా ఖాకి ‘ అనే పేరుతో ఈ సినిమాను చేశాడు. అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులోకి డబ్ చేయకుండా ఆ సినిమాని వెంకటేష్ తో రీమేక్ చేశాడు.

    ఇక ఇక్కడ కూడా మంచి హిట్ అవ్వడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలనైతే అందుకుంది. అయితే వెంకటేష్ కు ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ గా ‘ఘర్షణ 2’ చేస్తే బాగుంటుందని అనిపిస్తుందట. ఇక ఇదే విషయాన్ని తన సన్నిహితుల దగ్గర కూడా తెలియజేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి గౌతమ్ మీనన్ ఘర్షణ 2 స్క్రిప్ట్ పట్టుకొని వెంకటేష్ దగ్గరికి వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…