Ravi Teja And Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాల హవా ఎక్కువగా నడుస్తుంది. నిజానికి తెలుగు అనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా కూడా మల్టీ స్టారర్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఇక ఈ క్రమంలో దర్శక నిర్మాతలు ఎక్కువగా వాటిని చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడున్న హీరోలందరు ఎక్కడ తగ్గకుండా ఎవరితో అయినా సరే మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు.
ఇక రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ ట్రెండ్ అయితే మొదలైంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ‘ విక్రమ్ వేద’ సినిమాని తెలుగులో రవితేజ వెంకటేష్ కాంబినేషన్ లో చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు అనే విషయం మీద ఇంకా క్లారిటీ రానప్పటికీ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ ని కూడా హరీష్ శంకర్ మార్పులు చేర్పులు చేశారని డైరెక్షన్ మాత్రం ఎవరు చేస్తారనే దానిపైన సురేష్ బాబు ఒక నిర్ణయం తీసుకుంటాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక వెంకటేష్ రవితేజ కాంబో లో వచ్చే సినిమా అంటే ఇది అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. ఇక మాధవన్, విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ వేద సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా వాళ్ళిద్దరిని స్టార్లుగా చేయడంలో ఆ సినిమా కీలకపాత్ర వహించింది. మరి అలాంటి ఒక సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరమైతే ఉంది.
ఎందుకంటే ఏమాత్రం చిన్న తేడా కొట్టినా కూడా ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మరే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రీమేక్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక ప్లాప్ అయిన సినిమాలను మనం చాలా చూశాం. మరి ఈ సినిమా విషయంలో ఏం చేస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…