Sukumar: సుకుమార్ కి ఇతర డైరెక్టర్లకు మధ్య ఆ ఒక్కటే తేడా..? అందుకే ఈయన ఇంటలిజెంట్ డైరెక్టర్ అయ్యాడు…

తెలుగు లో ఉన్న చాలా మంది టాప్ డైరక్టర్లలో సుకుమార్ ఒకరు. అయితే ఈయన సినిమాలు తీసే స్టైల్ మిగితా వాళ్ళలా కాకుండా చాలా కొత్తగా ఉంటుంది. ఆర్య సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన సుకుమార్ మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆయన సినిమాలను చూడడానికి ప్రేక్షకులు అమితంగా ఇష్టపడతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Written By: Gopi, Updated On : July 24, 2024 12:00 pm

Sukumar

Follow us on

Sukumar: ఆర్య సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆర్య సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన సుకుమార్ మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆయన సినిమాలను చూడడానికి ప్రేక్షకులు అమితంగా ఇష్టపడతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక తన 20 సంవత్సరాల కెరియర్ లో తను చేసింది చాలా తక్కువ సినిమాలే అయిన కూడా చాలా సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా తను ఎంచుకున్న ప్రతి సినిమాను అద్భుతంగా మలచడం లో తను ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరొకసారి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ సుకుమార్ తో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఆయన మాత్రం మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పుష్ప 2 సినిమా తర్వాత ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుంది… ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసుకుంటూ వస్తున్న సుకుమార్ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టార్ డమ్ ను అందిస్తూ తను కూడా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఇప్పటివరకు ఎవరు చేయలేనటువంటి ఒక డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేస్తూ ఇంటలిజెంట్ డైరెక్టర్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలని చూసే ప్రేక్షకులకు చాలా ఎంటర్టైన్మెంట్ అందించడమే కాకుండా ప్రతి సీన్ లో కూడా ఒక ఇండెప్త్ స్టోరీని కూడా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

ఇక రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలను చూసే ఆడియన్స్ కి ఆయన సినిమాలు నచ్చకపోవచ్చు. కానీ కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు మాత్రం తప్పకుండా ఆయన సినిమాలు ఇష్టపడుతూ ఉంటారు. అందుకోసమే ఆయన ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూ సినిమాలు చేస్తుంటారు. ఇక దాంతో సగటు ప్రేక్షకుడికి తన సినిమా రీచైనప్పుడే తను భారీ సక్సెస్ ని అందుకోగలను అనే ఉద్దేశ్యంతోనే రంగస్థలం లాంటి ఒక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాని ఎంచుకొని ఇండస్ట్రీ హిట్టు ని కొట్టాడు…

ఇక మొత్తానికైతే మరోసారి భారీ రేంజ్ లో పుష్ప 2 సినిమాతో 1000 కోట్ల కలెక్షన్లకు పైన వసూళ్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమాను పోస్ట్ పోన్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయిన కూడా సుకుమార్ మళ్లీ ఆ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.