Salaar 2: ప్రభాస్ సలార్ 2 కోసం డేట్స్ ఇచ్చేది అప్పుడేనా..?

మరి వీటన్నింటికీ ప్రభాస్ ఎలా డేట్స్ ని అడ్జస్ట్ చేస్తాడు అనే విషయాల మీద కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ సలార్ 2 సినిమాని తొందరగా స్టార్ట్ చేసి చాలా తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడట.

Written By: Gopi, Updated On : May 18, 2024 8:08 am

Salaar 2

Follow us on

Salaar 2: ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియాలో మంచి వసూళ్లను రాబడుతూ తనకొక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక దానికి తోడుగా ఇప్పుడు కూడా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి తను ఆసక్తి చూపిస్తున్నాడు.

అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఇది ఇలా ఉంటే సలార్ 2 సినిమా షూటింగ్ కూడా చాలా తొందరగా మొదలు పెట్టాలని ఇప్పటికే ప్రభాస్ మీద చాలా ఫోర్స్ అయితే చేస్తున్నాడట. ఇక ఇప్పుడు దానికి సంభందించిన సెట్స్ ను కూడా ప్రశాంత్ నీల్ రెడీ చేయించే పనిలో బిజీగా ఉన్నాడు. కాబట్టి సలార్ 2 సినిమాకి సంబంధించిన షూట్ కూడా తొందర్లోనే ఉండబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.

మరి వీటన్నింటికీ ప్రభాస్ ఎలా డేట్స్ ని అడ్జస్ట్ చేస్తాడు అనే విషయాల మీద కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ సలార్ 2 సినిమాని తొందరగా స్టార్ట్ చేసి చాలా తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడట. ఇక దానికోసమే ప్రభాస్ తో మాట్లాడాలని చూస్తున్నాడట. ఎందుకంటే ప్రభాస్ ముందుగా సలార్ 2 సినిమా మీద తన డేట్స్ ని కేటాయించే విధంగా ప్రణాళికలు రూపొందించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక సలార్ 2 సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా చాలా గ్రాండీయర్ గా ఈ సినిమాని రూపొందించాలని ప్రశాంత్ నీల్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే సలార్ సినిమా ఎలాంటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే… దాదాపు 700 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి గత సంవత్సరం బిగ్గెస్ట్ హిట్స్ సాదించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ఈ సంవత్సరం ఎండింగ్ నుంచి సలార్ 2 సినిమాని స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…