Horoscope Today: 2025 మే 18 శనివారం రోజున ద్వాదశ రాశులపై ఉత్తర పాల్ఘుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కన్యరాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో రెండు రాశుల వారికి లక్ష్మీయోగం.. మరికొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవు. 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. లాభధాయకమైన పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
ప్రతీ దానికి స్పందించాల్సిన అవసరం లేదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. డబ్బు కొరత ఎక్కువగా ఉంటుంది. మానసికంగా శక్తివంతంగా ఉండాలి.
మిథున రాశి:
బావోద్వేగాలకు లోనుకావొద్దు. ఆలోచలన విధంగా సక్రమమైన పనులు చేయాలి. లక్ష్యాలను సాధించడానికి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు.
కర్కాటక రాశి:
ఆస్తుల విషయంలో శుభవార్త వించారు. ఉద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి.ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
సింహారాశి:
కొన్ని సవాళ్లను స్వీకరించాల్సి వస్తుంది. మీ స్థానం కోసం పోటీ ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాపారులకు అనుకున్న లాభాలు వస్తాయి.
కన్య రాశి:
కొన్ని కష్టాలు ఎదురైనా నిరాశ చెందకూడదు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వాదనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనసులో కొన్ని ఆలోచనలు ఇబ్బందులకు గురి చేయొచ్చు.
తుల రాశి:
సహోద్యోగులతో వాదనలకు దిగొద్దు. ప్రియమైన వారితో సంతోషంగా ఉండాలి. వినోదం కోసం చేసే ఖర్చులు పెరుగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు.
వృశ్చిక రాశి:
బంధువుల నుంచి ఓ బహుమతి పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు ఓ శుభవార్త వింటారు.
ధనస్సు రాశి:
డబ్బు సంపాదన పెరగొచ్చు. జీవిత భాగస్వామి నుంచి ప్రత్యేక బహుమతి పొందుతారు. ఇతర వ్యక్తులతో వాదనల ఎక్కువగా చేయొద్దు. కోర్టు కేసుల్లో న్యాయం జరిగే అవకాశం ఉంది.
మకర రాశి:
డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను నియంత్రించాలి. విశ్రాంతి తీసుకునేందుకు సమయం కేటాయించాలి. ఓ పని కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.
కుంభరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. కొన్ని రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. ఈరోజు బిజీబిజీగా ఉంటారు.
మీనరాశి:
ఆరోగ్య సమస్యలు వెంటాడుతారు. రాజకీయాల జోలికి వెళ్లొద్దు. వివాదాల్లో తలదూర్చొద్దు. ఏ పని చేపట్టినా ఆటంకాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల చాకచక్యంగా వ్యవహరించాలి.