Nagarjuna latest comments: అక్కినేని అఖిల్(Akkineni Akhil) ఈ ఏడాది జూన్ నెలలో జైనబ్ తో వివాహం ఆడిన సందర్భం, ఈ ఏడాది లో ఇండియా లో హాట్ టాపిక్స్ లలో ఒకటి గా నిల్చింది. వయస్సులో జైనబ్ అఖిల్ కంటే పెద్దనే అయినప్పటికీ, ఇద్దరి మనసులు కలవడం, అందుకు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడం తో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియా లో నాగ చైతన్య పై, అఖిల్ పై పలు రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. నాగ చైతన్య , శోభిత జంట త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారని, అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ శుభవార్త తో సంబరాలు చేసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని శోభిత టీం ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఇక అఖిల్, జైనబ్ ల జంట గురించి కూడా ఇదే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తూ వచ్చింది.
ఈ క్రమం లో నేడు ఒక హెల్త్ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా పాల్గొన్న నాగార్జున(Akkineni Nagarjuna), కాసేపు మీడియా తో ముచ్చటించాడు. ఒక రిపోర్టర్ నాగార్జున తో మాట్లాడుతూ ‘మీరు త్వరలోనే తండ్రి నుండి తాత గా ప్రమోట్ అవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముంది?’ అని అడగ్గా, దానికి నాగార్జున చిరునవ్వుతో సమాధానం చెప్తూ ‘సరైన సమయం వచ్చినప్పుడు నేనే అధికారికంగా చెప్తాను’ అని చెప్పొచ్చాడు. అంటే ఈ వార్తలు ఫేక్ అని ఆయన కొట్టి పారేయలేదు. కచ్చితంగా తన ఇద్దరు కొడుకులలో ఎవరో ఒకరు శుభవార్త వినిపించబోతున్నారు అన్నమాట. కచ్చితంగా శోభిత అయితే కాదు, ఎందుకంటే ఆమె ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గానే యాక్టీవ్ ఉంటుంది. ఆమె గర్భం దాల్చినట్టు ఎలాంటి దాఖలాలు కూడా లేవు. అంతే కాకుండా ఆమె షూటింగ్స్ లో కూడా పాల్గొంటుంది.
శోభిత కాకపోతే కచ్చితంగా జైనబ్ గర్భం దాల్చి ఉండొచ్చని అంటున్నారు అభిమానులు. కొత్త సంవత్సరం సందర్భంగా నాగార్జున ఈ విషయాన్నీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా చెప్తాడో లేదో చూడాలి. ఇకపోతే అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ సరైన సక్సెస్ లేకపోవడం తో అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ విషయంలో తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నాడు. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఆయన గత చిత్రం ‘ఏజెంట్ ‘ కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ‘లెనిన్’ తో ఎలా అయినా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్. చూడాలి మరి పెళ్లి తర్వాత ఆయన కెరీర్ లో ఏమైనా ఈ చిత్రం ద్వారా మార్పులు వస్తుందా లేదా అనేది.