https://oktelugu.com/

Star Heroine: పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది, 11 మందితో ఎఫైర్స్… 48 ఏళ్ల ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సుస్మిత సేన్ మొదటి చిత్రం దస్తక్. 1996లో విడుదలైన ఈ చిత్రంలో సుస్మిత సేన్ ప్రధాన పాత్ర చేసింది. ఆమె రెండో చిత్రం తెలుగులో చేసింది. నాగార్జునకు జంటగా నటించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 13, 2024 / 09:59 AM IST

    Star Heroine

    Follow us on

    Star Heroine: కెరీర్లో అధికారికంగా ఆమె 11 మంది ప్రముఖులతో ఎఫైర్స్ నడిపింది. పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది. 48 ఏళ్ల వయసులో నటిగా సత్తా చాటుతుంది. ఆమె ఎవరో కాదు సుస్మితా సేన్. ఫెమినా మిస్ ఇండియా 1994 టైటిల్ అందుకున్న సుస్మితా సేన్ అదే ఏడాది మిస్ యూనివర్స్ టైటిల్ కొట్టింది. మిస్ యూనివర్స్ టైటిల్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ లేడీ సుస్మిత సేన్ కావడం విశేషం. సుస్మిత సేన్ మోడలింగ్ నుండి నటిగా టర్న్ తీసుకుంది.

    సుస్మిత సేన్ మొదటి చిత్రం దస్తక్. 1996లో విడుదలైన ఈ చిత్రంలో సుస్మిత సేన్ ప్రధాన పాత్ర చేసింది. ఆమె రెండో చిత్రం తెలుగులో చేసింది. నాగార్జునకు జంటగా నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రక్షకుడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఒకే ఒక్కడు మూవీలో సుస్మిత సేన్ చేసిన ఐటెం సాంగ్ బాగా ఫేమస్. నటిగా సుస్మిత సేన్ పెద్దగా ఫేమస్ కాలేదు. ఆమె ఐటెం గర్ల్ గా స్థిరపడ్డారు. పలు చిత్రాల్లో స్పెషల్ నెంబర్స్ చేసింది.

    ఇక సుస్మిత సేన్ ఎఫైర్స్ లిస్ట్ చూస్తే చాలా పెద్దది. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఆమె ఎఫైర్స్ నడిపారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తో ఆమె కొన్నాళ్లు ఎఫైర్ లో ఉన్నారు. ఇంతియాజ్ ఖత్రి, ముదస్సర్ అజీజ్, రణదీప్ హుడాతో పాటు పలువురితో ఆమె అఫైర్స్ లో ఉన్నారు. ఐపీఎల్ డాన్ లలిత్ మోడీతో తన రిలేషన్ అధికారికంగా ప్రకటించింది సుస్మితా సేన్. కొన్నాళ్లకు అతనితో కూడా విడిపోయింది.

    మోడల్ రోహ్మాల్ షాల్ తో ఆమె బహిరంగంగా ఎఫైర్ నడిపారు. అతడిని పెళ్లాడుతుందని వార్తలు కూడా వచ్చాయి. కారణం తెలియదు కానీ రోహ్మల్ తో కూడా ఆమె బంధం సవ్యంగా సాగలేదు. ఇంత మందితో ఎఫైర్ నడిపిన సుస్మితా సేన్ ఎవరినీ వివాహం చేసుకోలేదు. అయితే ఆమె తల్లి మాత్రం అయ్యారు. 2000 సంవత్సరంలో 6 నెలల పాపను దత్తత తీసుకుంది. రీనె సేన్ అని పేరు పెట్టి పెంచుకుంటుంది. అలాగే 2010లో అలీషా అనే పాపను దత్తత తీసుకుంది. ఇటీవల ఆమెకు గుండెపోటు వచ్చింది. సుస్మిత నటించిన ఆర్య వెబ్ సిరీస్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది..