https://oktelugu.com/

Kalki 2898 AD Child Artist: కల్కిలో ఈ బుడ్డోడిని గమనించారా? మన మై విలేజ్ షో కుర్రాడు.. కల్కితో హాలీవుడ్ స్థాయికి..

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని లంబాడిపెల్లి అనే ఊరులో కొంతమంది కుర్రాళ్ళు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. అందులో నటుడిగా కొనసాగుతున్న రసూల్ అనే కుర్రాడు హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించిన కల్కి సినిమాలో ఒక పాత్ర చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన రసూల్(మని వర్షిత్) 'సత్తిగాడి రెండు ఎకరాలు' అనే ఒక సినిమాలో కూడా కీలకపాత్రలో నటించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 9, 2024 / 09:56 AM IST

    Kalki 2898 AD Child Artist

    Follow us on

    Kalki 2898 AD Child Artist: ప్రస్తుతం సోషల్ మీడియా భారీ రేంజ్ లో విస్తరించడంతో ఏ రోజున ఎవరు సెలబ్రిటీలుగా మారతారు అనే విషయాన్ని మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఒకరోజు ఏదైనా ఒక వీడియో హైలెట్ అయితే అప్పటికి అతన్ని సెలబ్రిటీగా చూడటం స్టార్ట్ చేస్తున్నారు. ఇక వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం ద్వారా వాళ్లు సినిమాల్లో అవకాశాలను కూడా దక్కించుకొని సినిమాల్లో రాణిస్తున్నారు.

    ఇక అలా కామెడీ వీడియోలు చేసే ఒక కుర్రాడు కూడా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కి సినిమాలో నటించాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని లంబాడిపెల్లి అనే ఊరులో కొంతమంది కుర్రాళ్ళు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. అందులో నటుడిగా కొనసాగుతున్న రసూల్ అనే కుర్రాడు హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించిన కల్కి సినిమాలో ఒక పాత్ర చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన రసూల్(మని వర్షిత్) ‘సత్తిగాడి రెండు ఎకరాలు’ అనే ఒక సినిమాలో కూడా కీలకపాత్రలో నటించాడు.

    ఇక దాని ద్వారా అతను చాలామందికి పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా ఈవెంట్ కి హాజరైన కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ ఈవెంట్ లో రసూల్ చేసిన సందడిని చూసి తను చేస్తున్న కల్కి సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం తనను సెలెక్ట్ చేసుకొని సినిమా చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక కల్కి సినిమా ప్రస్తుతం వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేసే రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది.

    ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా వెయ్యి కోట్లకు పైన వసూళ్లను రాబడుతుందంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రశంశలు అయితే దక్కుతున్నాయి… చూడాలి మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూళ్లను రాబడుతుంది అనేది…