Srikanth Odela Movies: తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు ఎలా ఉంటారు. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనుల్లో పని చేసే వ్యక్తులు ఎలా బతుకుతారు. వాళ్ళ దినచర్య ఏంటి వాళ్లు ఎవర్నైనా ప్రేమిస్తే ఎంతలా ప్రేమిస్తారు. శత్రుత్వం పెట్టుకుంటే ఎక్కడ దాకా వెళ్తారు అనే విషయాలను ‘దసర’ సినిమాలో చాలా బాగా చూపించారు…ఈ సినిమా దర్శకుడు అయిన శ్రీకాంత్ ఓదెల నానిని ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. అప్పటివరకు నాని చేయనటువంటి ఒక క్యారెక్టర్ ను తన చేత చేయించి సినిమాకి కలెక్షన్ల వర్షాన్ని కురిపించాడు. దాంతో నాని శ్రీకాంత్ ఓదెలను వదిలిపెట్టుకోలేక తనతో ప్యారడైజ్ అనే మరో సినిమాని కూడా చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో వాటన్నింటిని పర్ఫెక్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. శ్రీకాంత్ మొదటి నుంచి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతాడు.
ఇదే వైఖరిని కనక తన తర్వాత సినిమాలకి కూడా అలవర్చుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఆయన చాలా తక్కువ సమయంలోనే టాప్ పొజిషన్ కి వెళ్తాడు. ప్రస్తుతం నానితో చేస్తున్న ప్యారడైజ్ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవితో చేయాల్సిన ప్రాజెక్ట్ మీద తను వర్క్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
పాన్ వరల్డ్ లో ఈ సినిమాతో అందరిని షేక్ చేయాలని చూస్తున్నాడు. చిరంజీవి అందులో ఒక డాన్ క్యారెక్టర్ ని పోషించబోతున్నాడట. మొత్తానికైతే ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లలో శ్రీకాంత్ ఓదెల సైతం టాప్ లెవల్ కి చేరుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తను అనుకున్నట్టుగానే ఇప్పుడు తను చేస్తున్న ప్యారడైజ్ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దసర మూవీ రేంజ్ లోనే తెరకెక్కిస్తే బాగుంటుంది. ప్యారడైజ్ సినిమాలో బోల్డ్ కంటెంట్ ను వాడుతున్నప్పటికి అతను దానితోనే ప్రయోగం చేస్తున్నాడు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే పర్లేదు. ఒకవేళ బెడిసి కొడితే మాత్రం అతని కెరియర్ మరోసారి డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…