https://oktelugu.com/

Vijay Deverakonda: విజయ్ హీరోగా చేయాల్సిన ఫస్ట్ సినిమాలోకి ఆ స్టార్ హీరో ఎలా వచ్చాడు…

విజయ్ దేవరకొండ యూత్ లో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలడా అని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా ఆ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక దాంతో పాటు గా ఒక గ్రాండ్ విక్టరీని కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ని ప్రస్తుతం తను అందుకోవడంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో చాలా వరకు విఫలమవుతున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : July 13, 2024 / 08:49 AM IST

    Vijay Deverakonda

    Follow us on

    Vijay Deverakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ.. ఈయన ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని యూత్ లో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలడా అని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా ఆ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు.

    ఇక దాంతో పాటు గా ఒక గ్రాండ్ విక్టరీని కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ని ప్రస్తుతం తను అందుకోవడంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో చాలా వరకు విఫలమవుతున్నాయి.

    Also Read: శంకర్ ఒక పిల్ల బచ్చా కమలహాసన్ అనవసరం గా నువ్వు నీ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నావ్ అన్నదెవరో తెలుసా..?

    ఇలాంటి సందర్భంలోనే ఆయన ప్రస్తుతం మూడు సినిమాలతో మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. మరియు మూడు సినిమాలు కూడా మంచి క్రేజీ ప్రాజెక్టులే కావడం విశేషము… ఇక అందులో కనీసం రెండు సినిమాలు సక్సెస్ అయిన కూడా విజయ్ దేవరకొండ మళ్ళీ తిరిగి తన పూర్వ వైభవాన్ని చాటుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే పెళ్లి చూపులు సినిమాకు ముందే విజయ్ ఒక సినిమాని చేయాల్సి ఉంది. కానీ అనుకోకుండా అందులో నాని హీరోగా రావడం విజయ్ దేవరకొండ ఒక క్యారెక్టర్ ప్లే చేయడం లా అనుకోకుండా జరిగిపోయిందట. ఇక అసలు విషయానికి వస్తే ‘నాగ్ అశ్విన్’ డైరెక్షన్ లో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో మొదట విజయ్ నే హీరోగా తీసుకోవాలని అనుకున్నారట.

    కానీ ప్రొడ్యూసర్స్ మార్కెట్ పరంగా చూసుకొని అంత బడ్జెట్ విజయ్ మీద వర్కౌట్ కాదనే ఉద్దేశ్యం తోనే నాని ని హీరోగా తీసుకొని అందులో విజయ్ ని ఒక కీ రోల్ ప్లే చేసే విధంగా నాగ్ అశ్విన్ డిజైన్ చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో అప్పటి వరకు ప్లాపుల్లో ఉన్న నాని కి, మొదటి సినిమాగా విజయ్ దేవరకొండ కి దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి మంచి గుర్తింపు అయితే లభించింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో నాని ఒక మంచి హిట్ అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా చాటుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు.

    అయితే వీళ్ళ ఫ్రెండ్షిప్ కి గుర్తుగా అప్పటినుంచి ఇప్పటివరకు కూడా నాగ్ అశ్విన్ తాను చేసిన సినిమాల్లో విజయ్ దేవరకొండ కి చిన్న రోల్ అయిన సరే రాసుకొని అతని చేత చేయిస్తున్నాడు. విజయ్ కూడా అది చిన్న రోలా, పెద్ద రోలా అని ఆలోచించకుండా ఆయన సినిమాలో నటిస్తున్నాడు. ఇక మొత్తానికైతే వీళ్ళ ఫ్రెండ్షిప్ కి గుర్తుగా వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు…ఇక ప్రస్తుతం కల్కి సినిమా తో నాగ్ అశ్విన్ ఒక భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు కల్కి 2 సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది…

    Also Read: త్రివిక్రమ్ కి పూనమ్ కౌర్ మరో ఘాటు కౌంటర్… ఆయనకు కావాల్సింది నా దగ్గర లేదంటూ ఓపెన్ అలిగేషన్స్, కామెంట్స్ వైరల్