Manoj And Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న చిరంజీవి ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ గా ఎదిగాడు. ఆయన ఇప్పటికి కూడా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తనకు ఎదురు ఎవరు పోటీలేరు అనంతేలా ఆయన ప్రస్థానం ముందుకు సాగుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాయి.
చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాలు చేసుకుంటు ముందుకు కదులుతున్నాడు. ఇక రామ్ చరణ్ కి ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ లో మోహన్ బాబు కొడుకు అయిన మంచు మనోజ్ కూడా ఒకడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అంటే వీళ్ళ చిన్నతనంలో చెన్నైలో ఉన్నప్పుడు రామ్ చరణ్, మంచు మనోజ్ ఇద్దరు కూడా తరచూ కలుసుకుంటూ క్రికెట్ ఆడుతూ ఉండేవారు అంట. ఇక వీలైనప్పుడల్లా వీళ్ళు క్రికెట్ ఆడుతూ దానివల్ల మంచి ఫ్రెండ్స్ గా మారారట.
చిరంజీవి మోహన్ బాబు ఎప్పుడు చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూ టామ్ అండ్ జెర్రీ లా వ్యవహరించినప్పటికీ వీళ్ళు మాత్రం ట్రూ ఫ్రెండ్స్ గా ఉండేవారు ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ల మధ్య మంచి సాన్నిహిత్యం అయితే ఉంది. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే ఈవెంట్ లో కూడా మంచు మనోజ్ రామ్ చరణ్ తో ఫ్రెండ్షిప్ గురించి వివరించాడు…ఇక మొత్తానికైతే మంచు ఫ్యామిలీలోని హీరోతో మెగా ఫ్యామిలీ హీరో ఫ్రెండ్షిప్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి…
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఈ సంవత్సరం ఈ సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు తో చేయబోయే సినిమా రెగ్యూలర్ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు…