Deputy CM Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే పలు మంత్రిత్వ శాఖలకు మంత్రి గా పదవి బాధ్యతలను కూడా కొనసాగిస్తూన్నాడు. ఇక సినిమా రంగం నుంచి వెళ్లి రాజకీయ రంగంలో సూపర్ సకేస్ అయిన వ్యక్తిగా అప్పట్లో ఎన్టీయార్ నిలిస్తే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ స్థాయి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా నిర్మాతల మండలి లోని పెద్ద నిర్మాతలందరూ పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇక అందులో ముఖ్యంగా దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, అశ్వినీ దత్, డివివి దానయ్య, నాగ వంశీ లాంటి కొంతమంది ప్రొడ్యూసర్లు ఉండడం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే సుప్రియ యార్లగడ్డ కూడా పవన్ కళ్యాణ్ ను కలిసింది. నిజానికి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో వీళ్లిద్దరు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ముందుకు సాగాడు.
కానీ సుప్రియ మాత్రం హీరోయిన్ గా సినిమాలు చేయలేకపోయింది. ఇక మొత్తానికైతే చాలా సంవత్సరాల తర్వాత సుప్రియ పవన్ కళ్యాణ్ ను కలిసి అతనితో కొద్దిసేపు మాట్లాడి అతనికి కంగ్రాట్యులేషన్స్ కూడా చెప్పడం విశేషం. ఇక ప్రస్తుతం సుప్రియ పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్ గా స్థిరపడింది. ఇక ఆమె నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మాత్రం ఆ సినిమా పక్కగా సూపర్ సక్సెస్ అయ్యే విధంగా ఉంటుందనే పేరునైతే క్రియేట్ చేసుకుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుప్రియ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుంది.
అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోను చూసిన మరికొందరైతే వీళ్ళ కాంబోలో ఇప్పుడు ఏదైనా ఒక సినిమా వస్తె బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె కొన్ని ప్రాజెక్టులను చేస్తూ ప్రొడ్యూసర్ గా బిజీగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం పాలిటిక్స్ పనులను చక్క దిద్దే పనిలో ఉన్నాడు. ఇక మరో రెండు నెలల తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొనాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More